Breaking News

Covid-19 మళ్లీ వచ్చేసింది : కేసులు, మరణాలు, అధికారుల హెచ్చరికలు

Published on Thu, 05/15/2025 - 15:36

ఆసియాలో కోవిడ్‌మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా అంతటా కోవిడ్‌ న్యూ వేవ్‌ ఆందోళన రేపుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కనిపిస్తుండటం మరింత  ఆందోళనకరంగా మారింది.  ఆసియాలోని ఈ రెండు అతిపెద్ద నగరాల్లో వైరస్‌ కేసులు క్రమానుగతంగా పెరుగుతున్నందున, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్లు తీసుకోవాలని, ప్రజలు తమ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు పిలుపునిచ్చారు.

జనసాంద్రత ఎక్కువగా ఉన్న హాంకాంగ్, సింగపూర్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని  స్థానిక ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు  స్థానిక మీడియాతో అన్నారు. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్‌ కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరిందన్నారు. మే 3 నుండి వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో అత్యధిక స్థాయికి చేరుకుని 31కి చేరుకున్నాయని  అక్కడి లెక్కల ద్వారా తెలుస్తోంది.  7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో కనిపించిన కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ,  వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగాయని తెలిపారు.

అటు సింగపూర్‌లో మే 3 నుండి వారంలో గత ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200 కు చేరగా, రోజువారీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగింది. దీనికి సంబంధించి నగర-రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ నెలలో   కోవిడ్‌ డేటాను విడుదల చేసింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరగవచ్చు, అయితే, మహమ్మారి సమయంలో కంటే ప్రసరణ వేరియంట్లు వ్యాప్తి,  తీవ్రమైన కేసులకు సంబంధించిన సూచనలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇది ఇలా ఉంటే..హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ వారం చివర్లో తైవాన్‌లోని కావోసియుంగ్‌లో తన కచేరీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చైనీస్ సోషల్ మీడియా వీబోలోని కచేరీ అధికారిక ఖాతా గురువారం తెలిపింది.

ఇదీ చదవండి: పురుషులూ మేలుకోండి.. హాట్‌ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!

అటు చైనా కూడా  కోవిడ్‌ కేసులను, వ్యాప్తిని నిశితంగా గమనిస్తోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం,  ప్రస్తుతం గత సంవత్సరం వేసవిలో కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశగా చైనా పయనిస్తోంది. మే 4 దాకా ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడం గమనార్హం.

చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)