Breaking News

Covid-19 ‘హ్రస్వ దృష్టి’ సంక్షోభంలో ప్రపంచం

Published on Sat, 05/31/2025 - 15:00

2020లో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. కార్యాలయాలను, పాఠశాలలను మూసివేశారు. వినియోగదారు అనుకూల ఇంట ర్‌ఫేస్‌ జూమ్, ఇదే విధమైన వీడియో–కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫా మ్‌ల కారణంగా, ఇంటి నుండి పని చేసే కొత్త సంస్కృతి పుట్టింది. లాక్‌డౌన్‌ అనిశ్చితి, విద్యా కార్యకలాపాలను కోల్పోతామనే భయంతో చిన్నపిల్లలు, పసిపిల్లలు రోజుకు చాలా గంటలు తమ ఇళ్లలోనే ఉండి ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యారు. ఫలితంగా పిల్లలు హ్రస్వ దృష్టి (మయోపియా, Myopia) బారినపడ్డారు.

మొదట్లో చైనా, ఆ తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని నేత్ర వైద్య నిపుణులు 2020 నాటికి, చిన్న పిల్లల్లో ఆందోళన కలిగించే స్థాయి వేగంతో హ్రస్వ దృష్టి వ్యాపిస్తోందని కనుగొన్నారు. దీంతో ప్రమాద హెచ్చరికలు మోగాయి. చైనాలో ఆరేళ్ల వయస్సు పిల్ల లలో మయోపియా వ్యాప్తిలో 400 శాతం పెరుగుదలను గుర్తించారు. ముఖం నుండి 30 సెం.మీ. కంటే తక్కువ దూరంలో పుస్తకాలను ఉంచుకోవడం, 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరంతరం చదవడం అనేవి చిన్న పిల్లలలో హ్రస్వ దృష్టి పెరగడానికి ప్రధాన ప్రమాద కారకాలు. చదవడం, రాయడం ప్రభావితం కానప్ప టికీ, ఉపాధ్యాయుడు బ్లాక్‌బోర్డ్‌పై రాసిన అక్షరాలను, సుదూర వస్తువులను చూడలేకపోవడమే హ్రస్వదృష్టిగా సాధారణంగా వ్యవహరిస్తుంటారు. 

1960లలో పట్టణ, గ్రామీణ జనాభా రెండింటినీ విస్తృతంగా సర్వే చేసిన చీఫ్‌ డాక్టర్‌ ఐఎస్‌ జైన్‌ ముఖ్య మైన విషయాన్ని వెల్లడించారు. గ్రామీణ జనాభాలో (2.77 శాతం), పాఠశాల పిల్లల్లో (4.79 శాతం), చండీ గఢ్‌ పట్టణ జనాభాలో (6.9 శాతం), పీజీఐ వైద్యులలో (33 శాతం) మందిలో హ్రస్వ దృష్టి వ్యాప్తి క్రమంగా పెరగడానికి కంటికి దగ్గరలో పని చేయడం, అధిక అక్ష రాస్యత రేట్లు, ఆదాయ స్థాయులు కారణమని ఆయన అన్నారు. ఇటీవల, ఉత్తర భారతదేశంలో పాఠశాలకు వెళ్లే పట్టణ పిల్లలలో 21 శాతం మందికి హ్రస్వ దృష్టి ఉన్నట్లు గుర్తించారు. ఇది 50 ఏళ్లలో 4 రెట్లు ఎక్కువ.

పెరుగుతున్న హ్రస్వ దృష్టిపై కోవిడ్‌-19 క్వారంటైన్‌ ప్రభావం తూర్పు, ఆగ్నేయాసియాలో ముందుగా ఎక్కువగా కనిపించినప్పటికీ, తక్కిన ప్రపంచంలో ఎవరూ దానినుంచి తప్పించుకోలేదు. ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్‌ పరికరాల్లో రోజుకు సగటున ఒక గంట గడిపిన పిల్లలలో 46 శాతం మంది హ్రస్వదృష్టితో ఉన్నారు. నాలుగు గంటలు గడిపిన వారిలో 76 శాతం మంది ఉన్నారు. తక్కువ బహిరంగ కార్యకలాపాలు, మసక గది వెలుతురు, అధిక పని దీనికి కారణం.

గత 10 సంవత్సరాలలో, డిజిటల్‌ పరికరాల వాడకం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక మైన ‘జామా’ జర్నల్‌లో ‘3 లక్షల కంటే ఎక్కువ మంది పాఠశాల పిల్లలు పాల్గొన్న శాస్త్రీయ అధ్యయనాల ఆధా రంగా, రోజుకు కనీసం నాలుగు గంటల వరకు డిజిటల్‌ స్క్రీ¯Œ లపై గడిపే వారిలో, ప్రతి గంటకూ హ్రస్వ దృష్టి అభివృద్ధి చెందే అవకాశాలు 21 శాతం పెరిగాయని’ ఓ విశ్లేషణ ప్రచురితమయ్యింది. హ్రస్వదృష్టి బారిన పడిన అన్ని రకాల రోగుల్లో దాదాపు 8 శాతం మంది జీవి
తంలో తరువాత అంధత్వాన్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది మయో పిక్‌ రోగులే అవుతారని డాక్టర్‌ హోల్డెన్, ఆయన సహ చరులు చేసిన అంచనాలు నిజమైతే ఈ వ్యవహారం ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారవచ్చు. కంటి కండరాలను సడలించే అట్రోపిన్‌ కంటి చుక్కలను ఉపయోగిస్తే అవి చిన్న పిల్లలలో కనుగుడ్డు వ్యాప్తి చెందటాన్ని నిరోధిస్తాయని, అంతే కాకుండా హ్రస్వదృష్టి పెరగడాన్ని కూడా అవి తగ్గిస్తాయని సింగపూర్‌కు చెందిన డాక్టర్‌ చువా, ఆయన సహచరులు ఇరవై సంవత్సరాల క్రితమే నిరూపించారు. డాక్టర్‌ రోహిత్‌ సక్సేనా నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త అధ్య యనం ప్రకారం, రెండేళ్ల కాలంలోనే భారతీయ పిల్ల లలో కరిగిపోయే అట్రోపిన్‌ చుక్కలు (0.01 శాతం) ఉపయోగించినప్పుడు అవి హ్రస్వదృష్టి పెరుగుదలను తగ్గించాయని తేలింది. 

సూర్యరశ్మికి గురికావడం వల్ల రెటీనాలో డోపమైన్‌ స్థాయులు పెరుగుతాయి. ఇది హ్రస్వ దృష్టి బారిన పడ కుండా కాపాడుతుంది. కోవిడ్‌–19 సమయంలో ప్రతి రోజూ రెండు గంటలు బయట గడపడం అనేది పిల్ల లలో హ్రస్వ దృష్టి వ్యాప్తిని అరికడుతుందని టర్కీకిచెందిన డాక్టర్లు ధ్రువీకరించారు. బహిరంగ కార్యకలా పాలు రోజుకు 2 గంటలు మించి ఉంటే అట్రోపిన్‌ (బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ నిరోధకం) మరింత ప్రభావవంతంగా ఉంటుందని చండీగఢ్‌లోని డాక్టర్లు కనుగొన్నారు. అనుభవపూర్వకమైన, సమగ్ర అభ్యాసంపై దృష్టి సారించిన ‘జాతీయ విద్యా విధానం–2020’, పట్టణ భారతదేశంలో స్థల పరిమితుల సాకును చూపి, 2008 విద్యా హక్కు చట్టంలో తప్పనిసరి చేసిన ముఖ్యమైన ఆట స్థలం అవసరాన్ని తొలగించింది. అయితే ఉపా ధ్యాయులు పిల్లలను రోజుకు రెండుసార్లు కనీసం ఒక గంట బయట నడవడానికి అనుమతించాలి.

-అమోద్‌ గుప్తా
ఎమెరిటస్‌ ప్రొఫెసర్,
పీజీఐఎమ్‌ఈఆర్, చండీగఢ్‌ 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)