Breaking News

రైతులకు మరో ముప్పు.. ‘క్లైమేట్‌ఫ్లేషన్‌’ అంటే ఇదే!

Published on Fri, 10/02/2026 - 11:45

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఒకప్పుడు రుతువుల ప్రకారం పడే వర్షాలు ఇప్పుడు ఆకస్మిక వరదలుగా, తీవ్రమైన ఎండలుగా మారి పంట చేలను నిలువునా దహించివేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడులు భారీగా పడిపోవడంతో ఆహార చిల్లర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తాజా పరిశోధన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని ‘క్లైమేట్‌ఫ్లేషన్‌‘ (వాతావరణం కారణంగా ధరల పెరుగుదల) అని పిలుస్తున్నారు.

జీరో కార్బన్‌ అనలిటిక్స్‌ అధ్యయనం ప్రకారం.. 2022 నుంచి 2026 మధ్య కాలంలో ఆహార ధరలు పెరగడానికి ప్రధాన కారణం తీవ్రమైన వాతావరణ మార్పులే. గోధుమ, మొక్కజొన్న, కొకో, చక్కెర వంటి ప్రధాన పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనితో ఐక్యరాజ్యసమితి ఆహార ధరల సూచిక నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. స్వయం సమృద్ధి సాధించిన దేశాల్లో కూడా దిగుబడులు పడిపోయి, ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పంటలకు నష్టం
ఐరోపాలో అతిపెద్ద వ్యవసాయ దేశమైన ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. దీనివల్ల 1980 తర్వాత అత్యంత తక్కువ మొక్కజొన్న దిగుబడి నమోదైంది. దిగుబడి పడిపోవటంతో దాణా కొరత ఏర్పడి, పశుగ్రాసం ధరలు 16 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో రికార్డు స్థాయి ఎండలు, నీటి కొరత వల్ల గత 75 ఏళ్లలోనే అత్యల్ప స్థాయికి పశువుల సంఖ్య పడిపోయింది. గడ్డి, తాగునీరు లభించక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్పెయిన్‌ లో సాధారణం కంటే 175 శాతం అధిక వర్షపాతం నమోదై టొమాటో పంట నీట మునిగింది. మరోవైపు అమెరికాలో ఊహించని మంచు తుఫానుల వల్ల పంట దెబ్బతిని, కేవలం నాలుగు నెలల్లోనే టొమాటో ధరలు 40 శాతం ఎగబాకాయి. ఆసియా ్రపాంతంలో సముద్ర ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో ఆహారంగా ఉపయోగపడే సీవీడ్‌ వంటి పంటల ఉత్పాదకత దెబ్బతింటోంది.  

పంట దిగుబడులు తగ్గుదల ధరలు పెరుగుదల తీరు

మేల్కోవాల్సిన సమయం
ఈ వాతావరణ ముప్పు విదేశాలకే పరిమితం కాదు. మన దేశంలోనూ అకాల వర్షాలు, తీవ్ర ఎండలు తరచూ పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను కాపాడుకోవటానికి రైతులు వాతావరణ తీవ్రతను తట్టుకునేలా వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. తగిన విత్తనాలను ఎంచుకోవాలి. బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవటం, పంట మార్పిడి పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ విధానాలపై దృష్టి సారించటం తక్షణావసరం. ప్రభుత్వాలు కూడా రైతులకు పంట బీమా, అధునాతన వాతావరణ సూచనలను సకాలంలో అందించినప్పుడే ఆహార భద్రత నిలబడుతుంది.
- నిర్వహణ: పంతంగి రాంబాబు

ఇదీ చదవండి: ‘‘సూర్యుడుండగానే వడియాలు ఎండేస్కో’’!

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)