Breaking News

మొబైల్‌ వాడకుండా, ఎనిమిది గంటల్లో రూ. లక్ష సంపాదించింది!

Published on Mon, 12/09/2024 - 13:19

అందాల పోటీల్లో విశ్వసుందరిగా నిలిచిన సుందరాంగుల గురించి విన్నాం.. కుస్తీ పోటీల్లో కండబలం చూపించిన  ధీరేశ్వరుల గురించి తెలుసు. మేమేం తీసిపోయాం అంటూ అన్నింటా సమ ఉజ్జీగా  పోటీ పడుతున్నమగువల కథనాలూ చాలానే విన్నాం. కానీ ప్రస్తుతం ఒక వింత..కాదు కాదు, చాలెంజింగ్‌ అండ్‌ క్రియేటివ్‌ పోటీ ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. చైనాకు చెందిన ఒక మహిళ మొబైల్‌ ఫోన్‌ వాడకుండా ఎనిమిది గంటలు గడిపి లక్షరూపాయలకు పైగా బహుమతిని గెల్చుకుంది. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా..  అదేంటి అంటే..!


చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలోని షాపింగ్ సెంటర్‌లో ఈ  ప్రత్యేకమైన పోటీని నిర్వహించారు. ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా ఎనిమిది గంటల పాటు  మొబైల్ ఫోన్‌ వాడకుండా గడపాలి.   ఈ పోటీలో నైరుతి చైనాకు చెందిన ఒక మహిళ 10,000 యువాన్‌లను (సుమారు రూ.1,16,000) గెలుచుకుని వార్తల్లో నిలిచింది.

నవంబరు 29న జరిగిన ఈ పోటీలో 100 మంది దరఖాస్తుదారులలో పది మంది పోటీదారులు పాల్గొన్నారు. మొబైల్ ఫోన్‌లు లేదా ఐప్యాడ్‌లు లేదా ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రాప్యత లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు  చేసిన  బెడ్‌పై ఎనిమిది గంటలు గడపాలి. కంపోజ్డ్‌ గా, రిలాక్స్‌డ్‌గా ఉంటూ, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌( స్మార్ట్‌ఫోన్‌, ఐప్యాడ్‌, ల్యాప్‌టాప్‌) వాడాలన్న ఉత్సుకత లేకుండా గడపాలి.

నిబంధనలు, కత్తిమీద సామే
జిము న్యూస్ రిపోర్టుల ప్రకారం, నిబంధనలూ కఠినంగా ఉన్నాయి. ఈవెంట్‌కు ముందు పోటీదారులు తమ మొబైల్ ఫోన్‌లను సరెండర్ చేయాల్సి ఉంటుంది . అత్యవసర పరిస్థితుల్లో పాత మొబైల్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఎమర్జెన్సీ ఫోన్‌లను  కుటుంబ సభ్యులను సంప్రదించడానికి మాత్రమే ఉపయోగించాలి. అదనంగా, పాల్గొనేవారు ఎక్కువ సమయం పడుకునే ఉండాలి.  టాయిలెట్‌ బ్రేక్‌ కూడా ఐదు నిమిషాలు మాత్రమే. అంతేకాదు ఈ ఎనిమిది గంటలు  ఎంచక్కా బజ్జుంటాను అంటే అస్సలు కుదరదు. పోటీదారులు గాఢ నిద్రలోకి జారుకోవడం నిషేధం. 

పాల్గొనేవారి ఆహారపానీయలు  అందిస్తారు.  వారి మానసిక ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నంలో, నిర్వాహకులు మణికట్టు పట్టీలను ఉపయోగించి నిద్ర , ఆందోళన స్థాయిలను పర్యవేక్షించారు.  ఈ పోటీలు శారీరక బలం కన్నా, మానసిక బలం, ఓర్పు  ఎక్కువ అవసరం. అయితే పోటీదారుల్లో చాలామంది పుస్తకాలు, చదువుతా, విశ్రాంతిగా గడిపారు.    (హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు)

100కి 88.99 స్కోరు చేసి, ఫైనాన్స్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళ  విజేతగా నిలిచింది. మంచం మీదే, ఎలాంటి ఆందోళన లేకుండా, నిద్రపోకుండా ప్రశాంతంగా గడిపిందట. పోటీల్లో పాల్గొన్నటి దుస్తుల ఆధారంగా    "పైజామా సోదరి" అనే మారుపేరుతో సంచలనం రేపుతోంది. సంపాదించింది.  పరుపుల కంపెనీ ఈ పోటీని స్పాన్సర్ చేసింది.  ఈ పోటీపెట్టడంలో కంపెనీ  ఉద్దేశ్యం ఏంటి అనేది స్పష్టత లేదు కానీ నో మొబైల్-ఫోన్ ఛాలెంజ్ చైనా  అంతటా వైరల్‌గా మారింది.  

నిముష నిమిషానికీ మొబైల్‌ స్క్రీన్‌ను అన్‌లాక్‌ చేసే మొబైల్‌ యూజర్లకు  ఇది నిజంగానే అగ్ని పరీక్షే.  ఓసోసి.. అదెంత పని అనుకుంటున్నారా? అయితే మీరూ ప్రయత్నించండి. బోలెడంత ప్రశాంతత, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)