మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..!

Published on Mon, 02/02/2026 - 13:51

కోమాలో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఈ ఘటన  సరికొత్త ఆశను అందిస్తోంది. అచ్చం సినిమాని తలపించే సన్నివేశంలా..ఈ కేసులో ఆ బిడ్డ కోమా నుంచి బయటపడ్డాడు. వైద్యులు సైతం చేతులెత్తేశారు. కానీ మాటలు, సందేశాలే మంత్రాలుగా మారి మిరాకిల్‌ చేశాయి. ఆ బిడ్డకు ఊపిరిపోసి..కోమా నుంచి పూర్తిగా బయటపడేలా చేశాయి. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసేలా చేశాయి. 

అసలేం జరిగిందంటే..ఈ అద్భుత ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లోని యుయాంగ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు లియుచుక్కి నవంబర్‌ 2025లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు ప్రమాదంలో చిన్నారి చుక్కికి మెదడు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయలయ్యాయి. దాంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు సైతం కోమా నుంచి బయటడే అవకాశాలు తక్కువని అని తేల్చి చెప్పేశారు. 

కానీ ఆ బాలుడు తల్లి ఆశ వదులుకోలేదు. వైద్యుల సూచనల మేరకు అతడికి రోజు సుపరిచితమైన శబ్దాలు, మాటలు..వినేలా వాతావరణం కల్పించాలని చెప్పారు. దాంతో ఆ బాలుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి వారి మద్దతు..స్కూల్‌లో అసెంబ్లీలో ప్లే అయ్యే సాంగ్స్‌, ప్రార్థన గీతాలు వినిపించేలా చేసింది. అలాగే వీడియో కాల్‌ ద్వారా ఆ బాలుడి స్నేహితుల మాటలు అతనికి వినిపించేలా చేసింది ఆ బాలుడి తల్లి. రోజు అతడి స్నేహితులు.. 

రేయ్‌..! చుక్కి కళ్లుతెరవరా.., 
మాతో మాట్లాడరా, 
ఫుట్‌బాల్‌ ఆడదాం త్వరగా లేగు 
అన్న మాటలు ఆ బాలుడిలో స్పందన తెప్పించాయి. ఆ తల్లి అలా అతడి క్లాస్‌మేట్స్‌ మాటలు రోజు వినేలా చేయడంతో.. అతడి పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అంతేగాదు 45 రోజుల కోమా అనంతరం తొలిసారిగా కనురెప్పలు కదపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఉపాద్యాయుడి గొంతు విని నవ్వాడు. 

అలా 55వ రోజుకి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని కదిపాడు. తన పాఠశాల సంగీతం, సహ విద్యార్థులు సందేశాల రికార్డింగ్‌ ఆ బాలుడుని కోమా నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి హెల్ప్‌ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కదిస్తోంది. 

 

(చదవండి: ఒబెసిటీ డాక్టర్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..! ​కేవలం 18 నెలల్లో 56 కిలోలు..)
 

Videos

Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత

జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్

జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది ఇక్కడితో ఆగదు ఫ్యాన్స్ కు చిరు సర్ప్రైజ్

Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..

తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్

TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్

Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..

కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Photos

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)