Breaking News

చీఫ్‌ హ్యాపీనెస్‌ ఆఫీసర్‌గా శునక రాజా... ఆకట్టుకుంటున్న హైదరాబాద్‌ కంపెనీ

Published on Sat, 05/31/2025 - 11:40

పెట్స్‌ పేరుకే పెంపుడు జంతువులు కానీ వాటిని సొంత మనుషుల్లా చూసుకునే వాళ్లే ఎక్కువ. వాటికి పేర్లు పెట్టి, పుట్టినరోజులు చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటారు చాలామంది. ఇంటిలో పెట్స్‌ను పెంచుకోవడం మామూలే కానీ ఒక ఆఫీసులో స్ట్రెస్‌ రిలీవర్‌గా.. చీఫ్‌ హ్యాపీనెస్‌ ఆఫీసర్‌గా ఒక ఉత్తమజాతికి చెందిన శునకాన్ని నియమించింది ఒక స్టార్టప్‌ కంపెనీ. అది ఎక్కడో కాదు... హైదరాబాద్‌లోనే. 

ఆఫీసులో పని ఒత్తిడి సర్వసాధారణం. ఆ ఒత్తిడి నుంచి ఉద్యోగులను బయట పడేయడం ఎలా? ఆఫీస్‌లో రిక్రియేషన్‌ క్లబ్‌ పెట్టడం కన్నా ఓ మేలుజాతి శునకాన్ని రిక్రియేషన్‌ ఆఫీసర్‌గా నియమిస్తే కాస్త వెరయిటీగా ఉంటుంది కదా అని ఆలోచించింది ఆ స్టార్టప్‌ కంపెనీ. ఇంకెందుకాలస్యం.... వెంటనే డెన్వర్‌ అనే ఒక శునకాన్ని కంపెనీలో చీఫ్‌ హ్యాపీనెస్‌ ఆఫీసర్‌గా నియమించేసింది. ఇంతకూ ఈ డెన్వర్‌ ఉద్యోగుల ఒత్తిడిని ఎలా తొలగించగలదు? సంతోషాన్ని ఎలా ఇవ్వగలదనే కదా సందేహం? అక్కడికే వద్దాం... 

ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ యోగాసనాలు

ఉద్యోగులందరి దగ్గరకూ వరసబెట్టి వస్తారు ఈ ఆఫీసర్‌గారు... అందరినీ ప్రేమగా పలకరిస్తారు. స్నేహపూరితంగా షేక్‌ హ్యాండ్‌ (సారీ... ఇక్కడ లెగ్‌ అనాలి కాబోలు) ఇస్తారు. వీలయితే తనతో ఆడుకోవడానికి రమ్మని బాల్‌ తెచ్చి ఇస్తారు. ఆడుకున్న వారికి ఆడుకున్నంత సంతోషం. అన్నట్టు గూగుల్‌ సీయీవో సుందర్‌ పిచాయ్‌ కూడా తన స్ట్రెస్‌ బస్టర్‌ అయిన పెంపుడు శునకాన్ని తనతో పాటు ఆఫీసుకు తీసుకువస్తారట. ఒత్తిడిగా అనిపించినప్పుడు దానితో ఆడుకుంటారట. మరో విషయం... డెన్వర్‌కు లింక్డ్‌ ఇన్‌లో  ప్రొఫైల్‌ కూడా ఉంది.. ఫలానా కంపెనీలో చీఫ్‌ హ్యానీనెస్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లుగా.. బాగుంది కదూ...

ఇంట్లో పెట్స్‌ ఉన్నవాళ్లు ఒత్తిడి లేకుండా.. సంతోషంగా ఉంటారని, ఎక్కువ పని చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దానిని వాకింగ్‌కి తీసుకెళ్లడం, ఫుడ్‌ పెట్టడం వంటి వాటివల్ల బీపీ, షుగర్‌ వంటివి దరిచేరవట.  అందుకే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వారి పెట్స్‌తో సహా ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తున్నాయట! బాగుంది కదూ..

చదవండి: కొత్త పుస్తకాలు ఎందుకు సువాసన వెదజల్లుతాయి?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)