Breaking News

‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్‌

Published on Thu, 07/10/2025 - 12:08

ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా  సోషల్ మీడియాలో క్షణాల్లో మన ముందుంటుంది.  కింగ్ కోబ్రా అయినా పులులు, సింహాలైనా,  ఏనుగులైనా ఆకర్షణీయమైన వీడియోలు హల్‌ చల్‌ చేస్తూ  ఉంటాయి.   వర్షాలకు పరవశంతో ఆటుకుంటున్న పిల్ల ఏనుగుల వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది.

"మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే"  అని శ్రీశ్రీ అన్నట్టు  పిల్లలు ప్రకృతిలోని అందాలను  స్వచ్ఛమైన మనసుతో  ఆస్వాదిస్తారు. ఆడిపాడతారు.  పసితనం అనేది మనుషులకైనా.. జంతువులకైనా ఒకటే నిరూపించే ఘటన ఇది.  ఒక జోరు వాన పడుతోంది. దీంతో  గజరాజులతో కలిసి పిల్ల ఏనుగుల గుంపు బురదలో ఆడుకుంటూ సందడి చేశాయి.  ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ అన్నట్టు, ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటూ తొండంతో కొట్టుకుంటూ అల్లరి చేశాయి.  బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపును రాయ్‌గఢ్ అటవీ శాఖ డ్రోన్  కెమెరా బంధించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని ధరమ్‌జైగఢ్ ఫారెస్ట్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ ఎక్స్‌లో పోస్ట్‌  చేసింది. దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. 

ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం!

 

కాగా వర్షాకాలంలో ఏనుగులు బురదలో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. అవి గుంపులుగా చేరి, ఒకదానితో ఒకటి బురదను చల్లుకుంటూ, ఆడుతూ, గంతులేస్తూ ఆనందిస్తాయి. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.

 

 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)