Breaking News

14 కిలోల బరువు తగ్గిన డాక్టర్‌..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..

Published on Sun, 02/15/2026 - 11:48

వెయిట్‌లాస్‌ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్‌. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్‌లాస్‌ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్‌..? ఆమె వెయిట్‌లాస్‌ జర్నీ ఎలా సాగిందంటే..

చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్‌ బారియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్‌ కారణంగా ఒక నెలపాటు రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. 

ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్‌ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్‌పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. 

దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్‌ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్‌ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. 

డాక్టర్‌ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం..జీఎల్‌పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్‌లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: వెయిట్‌లాస్‌ మందులతో స్లిమ్‌గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)