Breaking News

కష్టాలకు బెదిరిపోవద్దు...ఈ ఐదు సూత్రాలు తెలుసుకోండి!

Published on Sat, 05/24/2025 - 15:26

కొందరు సమస్యలను చూసి పెద్దగా టెన్షన్‌ పడరు. వాటిని తేలికగా ఎదుర్కొని పరిష్కరిస్తారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా అనుకుంటారు. అటువంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఐదు విషయాలను తప్పక తెలుసుకోవాలి. 

ఎవరైనా తెలివితేటలను ఉపయోగించి సమస్య నుంచి బయటపడితే వారిని అపర చాణక్యుడు అని అంటాం. ఎందుకంటే భారతీయులలో చాణక్యుడికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే చాణక్యుడు గొప్ప సలహాదారు, వ్యూహకర్త, తత్వవేత్త. అలాగే వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు. ఆయన జీవితంలో ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని నీతి సూత్రాలు బోధించాడు. అందులో కష్టాల్లో ఉన్నపుడు ఎలా మసులుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పక్కా  ప్లానింగ్‌...
ఎవరినైనా సరే, సమస్యలు, సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటినుంచి తప్పించుకుని తిరగాలని చూడకూడదు. వాటిని ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకుని ఉండాలి. అప్పటికప్పుడు ఆలోచించడం కాకుండా తగిన ప్లానింగ్‌తో ఉంటే ఆ సమస్య నుంచి తేలికగా బయటపడగలరు. 

సంసిద్ధత...
చాణక్యుడు ఏం చెబుతాడంటే ఎవరైనా సరే, కష్టాలు వచ్చినప్పుడు బెంబేలత్తకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని కష్టాలు చుట్టిముట్టినపుడు సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ముందే ఊహించి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. దీనినే కీడెంచి మేలెంచడం అంటారు. సమస్య నుంచి పారిపోవడం కంటే కూడా దానిని ఎదుర్కొనేలా ఎవరికి వారు సంసిద్ధంగా ఉండాలి.  

చదవండి : ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్‌ నెం.1 లగ్జరీ కారు

ఓర్పు, నేర్పు...
చాణక్య విధానం ప్రకారం, ఎవరూ కూడా తన ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎప్పుడూ సహనం కోల్పోకూడదు. ఎప్పుడూ సానుకూల కోణంలో ఆలోచించాలి. మరీ ముఖ్యంగా, ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఓపిక పట్టాలి. నేర్పుతో దానిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. పరిస్థితి ఏమైనప్పటికీ, ఆ సమయంలో సహనం కోల్పోకండా మంచి రోజులు వచ్చే వరకు ప్రశాంతంగా వేచి ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలను  పొందవచ్చు. 

చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది

కుటుంబ సభ్యుల సంరక్షణ...
చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కుటుంబ పెద్ద లేదా కుటుంబ సభ్యుల మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంరక్షిస్తూనే, వారికి ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు దానినుంచి బయట పడేసేందుకు చర్యలు తీసుకోవడం అవసరం. 

డబ్బు ఆదాపై దృష్టి పెట్టడం...
ఎల్లప్పుడూ డబ్బును ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సూత్రాన్ని చాణక్యుడు దేశ కోశాగారం కోసం చెప్పినప్పటికీ అది మన ఇంటి కోశానికి కూడా పని చేస్తుంది. పై సూత్రాలను మనసులో పెట్టుకుని వాటి ప్రకారం కుటుంబాన్ని నడిపించుకుంటే మనం కూడా అపర చాణక్యులమవుతాం. 

చాణక్యుడిని గొప్ప వ్యూహకర్త అంటారు. ఎందుకంటే భారత రాజకీయాలు, చరిత్ర దిశను మార్చడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. తన జీవితకాలంలో ఆయన విధాన సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయవేత్తగా వివిధ పాత్రలు  పోషించారు. మానవ స్వభావం, జీవితం గురించి ఆయన చెప్పిన సిద్ధాంతాలు నేటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)