Breaking News

అతనంటే విపరీతమైన క్రష్!

Published on Sun, 02/22/2026 - 03:33

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అమాయకపు ఆకాంక్షగా, ‘సరైనోడు’లో పవర్‌ఫుల్‌ ఎమ్మెల్యేగా మనల్ని మెప్పించిన ఈ మలయాళ కుట్టి, తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌ రహస్యాలను ఇప్పుడు మనతో పంచుకుంటోంది క్యాథరిన్‌ ట్రెసా. ఆ విశేషాలు...

⇒ చిన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్  అంటే విపరీతమైన క్రష్‌. ఆయన టీవీలో కనిపిస్తేనే అన్నం తినేదాన్నని అమ్మ ఇప్పటికీ ఆటపట్టిస్తుంది. అలా ఎందుకు చేసేదాన్నో ఇప్పటికీ నాకు మిస్టరీనే.
⇒ నేను మలయాళీ క్రిస్టియన్ . పుట్టి పెరిగింది దుబాయ్‌లో. కాలేజీ రోజుల్లో బెంగళూరుకు షిఫ్ట్‌ అయ్యాను. అక్కడే నా మోడలింగ్‌ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కన్నడ సినిమా ‘శంకర్‌ ఐపీఎస్‌’ అవకాశం నా కెరీర్‌కు కొత్త మలుపును ఇచ్చింది.

⇒ సినిమాల్లోకి రాకముందు నేను ప్రొఫెషనల్‌ స్థాయిలో ఐస్‌ స్కేటింగ్‌ చేసేదాన్ని. మంచు మీద వేగంగా బ్యాలెన్ ్స చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ వెకేషన్ కు వెళ్తే స్కేటింగ్‌ షూస్‌ నా బకెట్‌లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయి.
⇒ సంగీతం నాకు మెడిటేషన్  లాంటిది. మనసు బాగాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పియానో వాయిస్తాను. నేను క్వాలిఫైడ్‌ పియానిస్ట్‌ని.

⇒ తెలుగులో ‘చమ్మక్‌ చల్లో’తో ఎంట్రీ ఇచ్చాను. కాని, నిజమైన బ్రేక్‌ ఇచ్చింది ‘ఇద్దరమ్మాయిలతో’. ‘సరైనోడు’లో ఎమ్మెల్యే పాత్ర నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌.

⇒ కేరళలో ఒక సినిమా షూటింగ్‌ సమయంలో నేను ఏనుగుపై నుంచి కింద పడిపోయాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటి నుంచి ఏనుగులంటే ప్రేమ ఉన్నా, వాటి దగ్గరికి వెళ్లాలంటే భయం.
⇒ ఒక గంట ఖాళీ దొరికినా బిజినెస్‌ మ్యాగజైన్స్‌ చదువుతాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ వుమన్ గా మారేదాన్ని. నా ఆర్థిక నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటాను.

⇒ పాత ఫొటోలను ఆల్బమ్స్‌గా చేసి దాచుకోవడం నా అలవాటు. డిజిటల్‌ యుగంలో ఉన్నా, ప్రింట్‌ ఫొటోలే నా సెంటిమెంట్‌.

⇒ నా జీవితంలో అతిపెద్ద బాధ నా తమ్ముడు క్రిస్టోఫర్‌ మరణం. ఎనిమిదేళ్ల క్రితం తను సూసైడ్‌ చేసుకున్నాడు. ఆ లోటు తీరనిది.
⇒ స్వీట్స్‌ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా తాపేశ్వరం మడతకాజా, మైసూర్‌ పాక్‌. అలాగే ‘లిక్విడ్‌ డైట్‌’ మీద నాకు మంచి కంట్రోల్‌ ఉంది. బాడీని డీటాక్స్‌ చేయడానికి వారంలో ఒకరోజు కేవలం కొబ్బరి నీళ్లు, గ్రీన్  జ్యూస్‌లతోనే ఉంటాను. అదే నా గ్లామర్‌ రహస్యం.

⇒ నా డ్రీమ్‌ మ్యాన్  పొడవుగా, ఫిట్‌గా ఉండాలి. ముఖ్యంగా మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండాలి.
⇒ గ్లామర్‌ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటాను. అందుకే అప్పుడప్పుడు గ్యాప్‌ వస్తుంది. నా కెరీర్‌లో ఇంకా మంచి కామెడీ సినిమాలు చేయాలని ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)