Breaking News

Cannes 2025 తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?

Published on Wed, 05/14/2025 - 10:32

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్‌ చేసింది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసే  ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మిస్‌ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్‌ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది.  డార్క్‌ గ్రీన్‌ ట్యాబ్‌ గౌను, ధరించి  యువరాణి లుక్‌లో తళుక్కుమంది.  మరీ ముఖ్యగా ఆమెధరించిన  ప్యారెట్‌ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో దాని ధర ఎంత అనే చర్చ  నెట్టింట సందడిగా మారింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్  78వ ఎడిషన్ మే 13, 2025న ప్రారంభమై మే 24, 2025న ముగియనుంది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 12 రోజుల పాటు జరిగే గ్లామర్, కళల అద్భుతమైన వేడుకలో  సందడి చేయనున్నారు. బాలీవుడ్‌   హీరోయిన్లతోపాటు, ఈ సారి 76  ఏళ్ల సిమీ గరేవాల్‌  కేన్స్‌  ఉత్సవంలో అరంగేట్రం చేస్తోంది.. ఈ సంవత్సరం కేన్స్ ముఖ్యాంశాలలో ఒకటి, అమెరికన్ నట దిగ్గజం, రాబర్ డి నీరోకు జీవిత సాఫల్యానికి గౌరవ పామ్ డి'ఓర్ అవార్డును ప్రదానం చేయడం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉర్వశి రౌతేలా   రెడ్ కార్పెట్ మీద నడిచింది.

ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్‌లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదు

ఊర్వశి ధరించిన గౌనుతో పాటు, రంగురంగుల రత్నాలు, చెవిపోగులు, రంగురాళ్ల కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచాయి.  ఇక  మేకప్  విషయానికి వస్తే, ముదురు ఊదా రంగు ఐషాడోతో బోల్డ్, గ్లామరస్ మేకప్‌, కళ్ళపై రైన్‌స్టోన్స్ స్టిక్కర్‌తో తన మరింత ఎలివేట్‌ చేసుకుంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేన్స్‌లో చిలుకలా దుస్తులు ధరించి వచ్చిన తొలి మహిళ,  ఇది నిజమా; లేక ఏఐ మాయాజాలమా అంటూ ఆశ్చర్యంలో మునిగి పోయారు.

హైలైట్ ఏంటంటే
ఊర్వశి లుక్‌లో మరో హైలైట్ ఆమె క్లచ్. సాధారణ, ప్రాథమిక క్లచ్‌లను పక్కనపెట్టి, జుడిత్ లిబర్ డిజైనర్ క్రిస్టల్ చిలుక క్లచ్‌ను ఎంచుకుంది.అద్భుతమైన క్లచ్ ధర 5,495 US డాలర్లు అంటే దాదాపు  రూ. 4,57,744లు.

గతంలో  ఊర్వశి రౌతేలా  క్రొకోడైల్‌ నెక్‌ పీస్‌ ధరించి పలువుర్ని ఆకర్షించింది.  2023 కేన్స్‌లో రూ. 200 కోట్ల విలువైన నకిలీ మొసలి నెక్‌పీస్ ధరించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సిమా కౌచర్ రూపొందించిన పింక్ టల్లే గౌనులో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలి సారి తన బ్యూటీని ప్రపంచానికి చాటా చెప్పింది. 
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)