నాన్నగారి కొలను..!

Published on Thu, 08/07/2025 - 11:19

చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ వికాస్‌ కుమార్‌ తన బాల్యజ్ఞాపకాల్లోకి వెళ్లినప్పుడల్లా కొంగల రెక్కల చప్పుడుతో ఊరి చెరువు ప్రత్యక్షమయ్యేది. ఆ చెరువులో తాను ఎన్నో సార్లు ఈత కొట్టాడు. అలాంటి అద్భుతమైన అనుభవం ఈతరం పిల్లలకు దూరం కావడం అతడికి బాధగా ఉండేది. ఆ బాధలో నుంచి పుట్టిందే... ఎకో ఫ్రెండ్లీ కొలను! కోయంబత్తూరులో ఉంటున్న వికాస్‌ సమీపంలోని చెరువుల్లో తన పిల్లాడికి ఈత నేర్పించాలనుకున్నాడు. 

అయితే మురికి, రసాయనాలతో కూడిన చెరువులు అతడిని భయపెట్టాయి. అలా అని ఆయన ఊరకే ఉండిపోలేదు. పాల్లాచ్చిలోని తన స్వంత వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్‌–క్లీనింగ్‌ పాండ్‌ను నిర్మించాడు. దీనికి ముందు యూరప్‌లో ప్రసిద్ధి పొందిన ఎకో–ఫ్రెండ్లీ బయో స్విమ్ పాండ్స్‌ గురించి అధ్యయనం చేశాడు. 

తన వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్‌–క్లీనింగ్‌ పాండ్‌ను నిర్మించడానికి మాత్రమే పరిమితం కాలేదు వికాస్‌. మన దేశ వాతావరణం, జీవనశైలికి అనుగుణంగా బయో స్విమ్మింగ్‌ కొలనులను నిర్మించడానికి  ‘బయోస్పియర్‌’ అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ సహజసిద్ధమైన జలపాతాలు, కొలనులకు రూపకల్పన చేస్తోంది. 

‘మాకు మీలాంటి కొలను ఒకటి కావాలి’ అని తమ పిల్లలతో తల్లిదండ్రులు వచ్చినప్పుడు వికాస్‌కు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ సంతోషం తన కంపెనీకి వచ్చే లాభాల గురించి కాదు. పర్యావరణ హిత, రసాయన రహిత కొలనుల గురించి వారు ఆలోచన చేస్తున్నందుకు! 

 

(చదవండి: స్టుపిడ్‌ కాదు సూపర్‌ కపుల్‌! ఆ జంట లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)