Breaking News

తల్లిపాల నిర్వహణలో... స్మార్ట్‌ పరికరాలు

Published on Thu, 08/06/2026 - 04:57

బిడ్డ పుట్టడానికి ముందే తల్లిపాలు పట్టే పరికరాలను సిద్ధం చేసుకోవడం వల్ల ప్రసవానంతర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు అనేది నిపుణుల సూచన. ఫలితంగా తల్లి ప్రసవానంతరం కలిగే వివిధ రకాల ఒత్తిడులను తగ్గించుకునే వీలుంది.

తల్లిపాల పరికరాలు రోజువారీ సవాళ్లలో కొన్నింటిని సులభతరం చేసినా, సరైన సహకారం అందినప్పుడే వాటిని బాగా వినియోగించుకోగలరు. చనుబాలు పట్టించే నిపుణుల గైడెన్స్‌తో పాటు బాధ్యతలను పంచుకునే భాగస్వామి మద్దతు అవసరం. ‘బిడ్డలకు పాలిచ్చే పనులను సులువు చేయడానికి తల్లులు బ్రెస్ట్‌ పంపులు (51 శాతం), నర్సింగ్‌ బ్రాలు (37 శాతం), నర్సింగ్‌ దిండ్లు (31శాతం) వంటి సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదికలు చూపుతున్నాయి. నవతరం అమ్మలకు వచ్చిన అనుకూల ఉత్పత్తుల గురించి...

  • ఫీడింగ్‌ మానిటర్స్‌: శిశువు పాలు మింగే శబ్దాలను గుర్తించడానికి, ఎన్ని పాలు తాగిందో లెక్కించడానికి, ఏఐ–ఆధారిత సెన్సార్‌లు కూడా వచ్చాయి.

  • రియల్‌–టైమ్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వేరబుల్‌: ఇది రొమ్ము చుట్టూ చుట్టుకునే ఒక మృదువైన, అనువైన పరికరం. ఇది బయోఇంపిడెన్‌ ్సను ఉపయోగించి, శిశువు ఎన్ని పాలు తాగిందో అనే దానిపై క్లినికల్‌–గ్రేడ్, లైవ్‌ డేటాను మొబైల్‌ స్క్రీన్‌ లపై అందిస్తుంది. 

  • లాక్టేషన్‌ ప్యాడ్‌ డ్రగ్‌ ట్రాకర్లు: ఇవి మైక్రోఫ్లూయిడిక్‌ ఛానెల్స్, లేజర్‌–ప్రేరిత గ్రాఫేన్‌ సెన్సార్లతో పొందుపరిచిన మోడర్న్‌ వేరబుల్‌ ప్యాడ్స్‌. తల్లి తీసుకునే మందులు (ఎసిటమినోఫెన్‌ వంటివి) నేరుగా తల్లిపాలలోకి చేరే రేటును ట్రాక్‌ చేసి, కొలుస్తాయి.

  • ఇన్‌ఫాంట్‌ స్మార్ట్‌ బాటిల్స్‌: ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి, సింక్రొనైజ్డ్‌ యాప్‌ల ద్వారా శిశువు బరువు పెరుగుదలను ట్రాక్‌ చేయడానికి బయోఫీడ్‌బ్యాక్‌ డేటాను అందిస్తాయి.

    ఇతర అనుకూలమైన పరికరాలు...

  • ఎలక్ట్రిక్‌ బ్రెస్ట్‌ పంప్స్‌: వీటిని నర్సింగ్‌ బ్రా లోపల సెట్‌ చేసుకోవచ్చు. పాలు ఎక్కువైనప్పుడు ఈ పరికరం ద్వారా పాలు తీసి, స్టోరేజ్‌ చేయవచ్చు.

  • నర్సింగ్‌ కవర్స్‌: తల్లిపాలు పట్టే సమయంలో మెడ భాగం నుంచి నడుము కిందవరకు ఆ్రపాన్‌ తరహాలో ఉండే కాటన్‌ కవర్‌ పూర్తిగా కప్పి ఉంచుతుంది. బిడ్డ పాలు తాగుతుండగా తల్లి నేరుగా చూసే అవకాశమూ ఉంటుంది. బయట పాలు పట్టడం అనే ఇబ్బందిని ఈ కవర్‌ దూరం చేస్తుంది.

  • బ్రెస్ట్‌ ఫీడింగ్‌ పిల్లోస్‌: పాలిచ్చే సమయంలో బిడ్డను పిల్లోపైన పడుకోబెట్టడానికి., కదలకుండా ఉండటానికి.. వీటిని ఉపయోగిస్తుంటారు. పాలు తాగే సమయంలో తల్లికి–బిడ్డకు ఈ పిల్లో అనువుగా ఉంటుంది.

  • నర్సింగ్‌ ప్యాడ్స్‌: లీక్‌ ప్రూఫ్స్, స్కిన్‌ ఫ్రెండ్లీవి లభిస్తున్నాయి. వాపు, నొప్పి ఉన్న రొమ్ము చర్మానికి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే చల్లని జెల్‌ ప్యాడ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

  • బ్రెస్ట్‌ మిల్క్‌ కంటెయినర్స్, స్టోరేజీ కప్స్‌: రొమ్ము నుంచి తీసిన పాలను కంటెయినర్లలో భద్రపరచేవి. సెన్సార్‌ స్టోరేజీ బ్యాగ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి బిడ్డకు తగినంత ఉష్ణోగ్రతలలో పాలు ఉండేలా నిల్వ చేస్తాయి. ఓవెన్‌ లేదా స్టవ్‌ ఉపయోగించకుండా ఫ్రీజర్‌లో భద్రపరిచిన పాలను కరిగించే స్మార్ట్‌ బాటిల్‌ వార్మర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

  • సిలికాన్‌ నిపుల్‌ ప్రొటెక్టర్‌: మొదటిసారి బిడ్డకు పాలు పట్టే సమయంలో, ఆ తర్వాత చనుమొనలు చిట్లడం, నొప్పి సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు సిలికాన్‌ నిపుల్‌ ప్రొటెక్టర్స్‌ బాగా ఉపయోగపడతాయి.

  • బ్రెస్ట్‌ నిపుల్‌ క్రీమ్‌: ప్రసవం తర్వాత ΄÷డిబారిన, చిట్లిన, నొప్పిగా ఉన్న చనుమొనల సమస్యను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)