Breaking News

నటుడు ధర్మేంద్ర వాటర్‌ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! ఎలా చేస్తారంటే..

Published on Mon, 05/05/2025 - 13:00

బాలీవుడ్‌ లెజెండ్‌ ధర్మేంద్ర(Dharmendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ మూవీలతో వేలాది అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఎనిమిది పదుల వయసులో కూడా అంతే అందంగా మంచి ఫిట్‌నెస్‌తో ఉంటారు. అంతేగాదు తరుచుగా తన వర్కౌట్‌ వీడియోలతో ఆరోగ్య స్పృహను కలుగుజేస్తుంటారు. తాజాగా తన గేమ్-ఛేంజర్ వాటర్ వ్యాయామాలతో వీడియోని షేర్‌ చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచారు. కండరాల కదలికలు కోసం, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే శారరీక కదలికలకు ఈవ్యాయామాలు మంచి గేమ్‌ ఛేంజర్‌ అనిపోస్ట్‌లో పేర్కొన్నారు 89 ఏళ్ల ధర్మేంద్ర. ఈ నేపథ్యంలో ఆ వ్యాయమాలు ఎలా చేస్తారు..? కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

నీటిలో చేసే ఈ సున్నితమైన వాటర్‌ వ్యాయామాలు శరీరానికి మంచి కదలికలని చెబుతున్నారు నిపుణులు. కాళ్లకు, మొత్తం శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి వ్యాయామాలు తప్పనిసరి అని అన్నారు. ఇలా చల్లటి నీటిలో తేలియాడుతూ చేసే రిలాక్స్‌డ్‌ వ్యాయామాలు ఏంటో చూద్దామా..!.

వాటర్ వాకింగ్: ఇక్కడ నీటిలో నడవడం బయట భూమిపై నడిచినంత ఈజీగా చేయలేం. కొద్దిమొత్తంలో బలాన్ని ఉపయోగించి నడవాల్సి ఉంటుంది. మన అడుగుపడకుండా చేసే నీటి నిరోధకతతో ఫోర్స్‌గా నడవడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేగాదు నీటిలోకి దిగి తేలియాడుతూ..స్మిమ్మింగ్‌పూల్‌ చుట్టూ నడవాలి. దీనివల్ల ఎలాంటి కండర సమస్యలు ఉండవని చెబుతున్నారు నిపుణులు.

వాటర్ జాగింగ్: ఇక్కడేంటంటే ఇంకాస్త ముందడుగు వేసి భూమ్మీద చేసినట్లుగా పూల్‌ చుట్టు జాగింగ్‌ చేయాలి. దీనివల్ల త్వరితగతిన చెమటలు పట్టేస్తాయి. స్పీడ్‌గా కేలరీలు బర్న్‌ అవ్వడమే గాక శరీరానికి చక్కని వ్యాయామంలా కూడా ఉంటుంది.

ఫ్లట్టర్ కిక్స్: పూల్ సైడ్‌ను పట్టుకుని శరీరాన్ని నిటారుగా ఉంచి.. ఫ్లట్టర్ కిక్ చేయాలి. చల్లటి నీటిలో ఉంటూ  కాళ్ళకు తగిన వ్యాయామం అందించే మార్గం. ఇది ఒకరకంగా ఈత కొడుతున్న అనుభూతి కలిగిస్తుంది. .

లెగ్ రైజెస్: పూల్‌ చివరలో నిలబడి కాళ్ళను పక్కకు ఎత్తండి. ఇది  హిప్ ఫ్లెక్సర్‌లను బలంగా ఉంచుతుంది. ఇది బాడీకి సూపర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది.

వాటర్ పుష్-అప్‌లు: పూల్ అంచుపై చేతులను ఉంచి, మోచేతులు వంచి నిలబడండి. ఆ తర్వాత అంచు నుంచి మిమ్మల్ని దూరంగా నెట్టండి, ఆపై నెమ్మదిగా వెనుకకు తగ్గించండి. ఇది అచ్చం పుష్-అప్ చేయడం లాంటిది. అయితే నీటి నిరోధకత పైకి లేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ శరీరాని మంచి కదలికలను అందించడమే గాక కండరాలు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగ నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి.

 

(చదవండి: ఎంత పనిచేశావ్‌ నాన్న..! హార్ట్‌ టచింగ్‌ వీడియో..)

 

 

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)