Breaking News

లగ్జరీ కారు గిఫ్ట్‌ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’

Published on Sat, 06/07/2025 - 14:55

జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ తల్లి రేవతి కామత్ కోసం  ఇటీవల ఒక లగ్జరీకారు  కొనిచ్చారు.  అలా కొనిచ్చిన మూడు నెలల తరువాత ఆమె బెంగళూరు మెట్రోలో ప్రయాణించడం విశేషంగా నిలిచింది.  పర్యావరణవేత్త , వీణ కళాకారిణి కూడా అయిన రేవతి పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారు.  దీనిపై ఆమె పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

బిలియనీర్ కొడుకులు నిఖిల్‌, నితిర్‌ ఇద్దరే  సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును బహుమతిగా ఇచ్చారు.  ఈ  సంగతిని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ, తన కొడుకులు తనకు సాంప్రదాయ పద్ధతిలో, సరైన ఆచారాలతో పాటు బహుమతినిచ్చారంటూ సంతోసాన్ని  వ్యక్తం చేశారు. మెర్సిడెస్ GLS  ధర  రూ.1.5 కోట్లకు పైగా ఉంది. విశాలమైన క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ,పవర్‌ఫుల్‌ ఇంజిన్ ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి ఇందులో.  సరిగ్గా మూడు నెలల తర్వాత మరోపోస్ట్‌ చేశారు.   బెంగళూరు  మెట్రోలో ప్రయాణిస్తూ, ప్రజా రవాణా వ్యవస్థ సౌలభ్యాన్ని ప్రశంసించారు."మెట్రోలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది, అది కూడా మహిళా కంపార్ట్‌మెంట్‌లో! నమ్మమెట్రో" అంటూ ఇన్‌స్టా క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్‌

కాగా  పర్యావరణ పరిరక్షణకు  ఆమె చేసిన కృషిని వెబ్‌సైట్ ప్రస్తావించింది. రేవతి కామత్‌ వెబ్‌సైట్‌ అందించిన సమాచారం ప్రకారం ఆమె లక్షకు పైగా చెట్లను నాటారు. కర్ణాటకలోని కనకపురలోని సోమనహళ్లి సరస్సును పునరుద్ధరించరు. దీంతో అదిపుడు పచ్చిన ప్రకృతితో, నిండుగా కళకళలాడుతోంది. అంతేకాదు 28 ఎకరాల భూమికి, 300 బోర్‌వెల్స్, 200 ఓపెన్ బావులకు ప్రయోజనకరంగా మారింది. ప్రతీ తల్లికి, ఆమె పిల్లల విజయం గొప్ప బహుమతి. కానీ రేవతి కామత్‌ విషయంలో ఆమె కుమారులు, జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ మరో అడుగు ముందుకు వేశారు. అయితే  ఒక ‘అమ్మ’గా పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చి మరో మెట్టు ఎక్కారు అంటున్నారు అభిమానులు. ఈ అమ్మలందరూ అంతే.. అంటూ మరికొందరు భావిస్తున్నారు.

 

ఇదీ చదవండి:  డాడీ అంత పాపులర్‌ కాదు కానీ.. ఫ్యాషన్‌ వరల్డ్‌లో స్పెషల్‌ లేడీ!
 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)