Breaking News

Kuwait Fire వచ్చే నెలలోనే పెళ్లి... భగవంతుడా నాబిడ్డ ఎక్కడ?

Published on Fri, 06/14/2024 - 12:33

కువైట్‌లోని మంగాఫ్ భవనంలో చెలరేగిన మంటలు మరణమృదంగాన్ని సృష్టించాయి. పొట్టచేతపట్టుకొని ఎడారి దేశం పోయిన శ్రమజీవులు 45 మంది భారతీయులు అగ్నికి ఆహూతైపోయారు.  పూర్తిగా కాలిపోవడంతో  గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తన బిడ్డ ఏమైపోయాడో తెలియక బిహార్‌కు చెందిన ఒక తల్లి తల్లడిల్లి పోతోంది.

ఈ అగ్నిప్రమాదం గురించి విన్నప్పటి నుండి బిహార్‌లోని  దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన మదీనా ఖాతూన్ తన కొడుకు ఆచూకీకోసం ఆందోళన పడుతోంది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన తన పెద్ద కొడుకు కాలూ ఖాన్  ఫోన్‌ కాల్స్‌కు స్పందించడంలేదనీ, అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని వాపోతోంది. తన కుమారుడికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేసింది. శుభవార్త అందించు దేవుడా అంటూ ఖాతూన్ కన్నీరు మున్నీరవుతోంది.

కాలూ ఖాన్  ప్రమాదం జరిగిన భవనంలో నివసిస్తున్నాడని, పెళ్లి కోసం  జూలై 5న రావాల్సి ఉందని  చెప్పింది.  "కొన్నేళ్లుగా కువైట్‌లో నివసిస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేనుఫోన్‌లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు" అని ఆమె మీడియా ప్రతినిధులకు  తెలిపింది. అతని ఫోటోలను ఎంబసీ అధికారులకు పంపామనీ, అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది.

"ఎలక్ట్రికల్ సర్క్యూట్" కారణంగా ఘోరమైన మంటలు సంభవించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. కువైట్ మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలో ల్యాండ్ అయింది.


మృతిచెందిన వారి సంఖ్య రాష్ట్రాల వారిగా 
కేరళ - 23 
తమిళనాడు -7
ఉత్తరప్రదేశ్ -3
ఆంధ్రప్రదేశ్ -3
ఒడిశా- 2
బీహార్, వెస్ట్ బెంగాల్  పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, జార్ఖండ్   రాష్ట్రాల నుంచి  ఒక్కొక్కరు ఉన్నారు. 

 రూ. 2 లక్షల పరిహారం
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)