JC నా వెంట్రుకతో సమానం.. పెద్దారెడ్డి మాస్ వార్నింగ్
Breaking News
అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..
Published on Fri, 01/16/2026 - 21:41
ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లని, ప్రాణ స్నేహితుల్ని నమ్మడానికి వీల్లేని రోజులు. సాయం చేసిన వాడినే నాశనం చేసే దారుణమైన గడ్డు రోజుల్లో. 'మనిషన్న వాడు కానిరాడమ్మా..' అనే ఆర్యోక్తిలా ఉన్నాయి పరిస్థితులు. అందుకు సమాజంలో జరిగిన ఎన్నో ఉదంతలే నిదర్శనం. కానీ దాన్నే తలదన్నేలా ఇక్కడ జరిగిన సంఘటన హైలెట్‌గా నిలిచింది. పైగా 'నమ్మకానికి' కొండంత విలవ ఉంది అని నిరూపించే అపురూపమైన ఘటన ఇది.
మెట్రో ప్రయాణం ఎలా ఉంటుందో తెలిసిందే. జనంతో కిటకిటలాడుతూ..అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి బెంగళూరు మెట్రో ప్రయాణంలో జరిగిన ఘటన నెట్టింట అందరి మనసులను తాకింది. రోజువారి ప్రయాణంలో కనిపించిన దయకు సంబంధించిన ఓవిషయాన్ని నెట్టింట ఒక మహిళ పంచుకుంది. ఆ పోస్ట్‌లో ఆ మహిళ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడూ..ఒక చిన్న అమ్మాయి మణికట్టుపై అందమైన బంగారు గాజుని గమనించింది. అయితే ఆ గాజు డిజైన్ ఆమెను ఆకట్టుకుంది.
వెంటనే ఆమె ఆ అమ్మాయిని కాస్త ఆ గాజుని ఫోటో తీసి ఇవ్వగలరా..నేను అదేలాంటి డిజైన్ గాజుని తయారుచేయించుకుంటానని అడిగింది. అయితే ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. పైగా ఆ మహిళను విస్తుపోయాలే చేసింది ఆ అమ్మాయి. అప్రయత్నంగా తన చేతి గాజుని తీసి ఆ మహిళ చేతిలో పెట్టేసి మీకు నచ్చినట్లుగా చేయించుకోండి అని సింపుల్‌గా అంటుంది.
ఆ హఠాత్పరిణామనికి ఆ మహిళ నోట మాట రాలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి.. ఇది ఒరిజనల్ బంగారు గాజు కాదని, ఇంది వన్ గ్రామ్ గోల్డ్ బంగారు గాజు అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆమె విశాల హృదయం, నిజాయితీ ఆమె మనసుని తాకడమే గాక ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకం ఇంకా బతికే ఉందా అని ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది.
అంతేగాదు ఆ అపురూపమైన క్షణానికి గుర్తుగా ఆ గాజుని తన వద్ద ఉంచుకుంది. పైగా అందుకు సంబంధించిన అపురూపమైన క్షణాన్ని పంచుకుంటూ ఆ గాజు తన సొంతం ఎలా అయ్యిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
(చదవండి: పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..)
Tags : 1