Breaking News

ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..

Published on Mon, 06/29/2026 - 14:48

అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది. ఆ సంతోషాన్నే తన తల్లికి అందిచింది ఈ కూతురు. ఆమె ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు అమ్మే కారణం అంటూ తన విజయ ప్రస్థానాన్ని షేర్‌ చేసుకుంది.

అనుస్మిత మహాపాత్ర అనే యువతి తన తల్లి చేసిన త్యాగం తన ఉద్యోగ కెరీర్‌కు దారితీసేలా స్ఫూర్తిని కలిగించిందో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. తన కాలేజ్‌ అడ్మిషన్‌ ఫీజు కోసం అమ్మ తన బంగారు గాజులున తాకట్టుపెట్టిందని. దాని వల్ల ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ పనిచేసే స్థాయికి రాగలిగానని అంటోంది. ఇది తనకు ఉద్యోగం కాదని అంతకు మించి అని భావోద్వేగంగా చెబుతోంది. 

తాను ఇవాళ ఉద్యోగానికి వెళ్తున్నానంటే అది ఆమె ఆనాడు చేసిన త్యాగం కారణంగానే అంటోంది. ఇది ఆమె చేసిన త్యాగానికి నిదర్శనమని భావోద్వేగంగా అంటోంది. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆమె మా కోసం అన్ని చేసిందంటూ తల్లి గురించి ఇలా రాసుకొచ్చింది. "తనతల్లి అమితా మహాపాత్ర అని. ఆమె ఒక ఉపాధ్యాయురాలని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడూ కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిలో  చేరిందని. 

నెలకు కేవలం రూ. 3000 జీతం అందుకునేది. రెగ్యులర్‌ అయ్యేదాక ఆరేళ్లు కాంట్రాక్టుగానే పనిచేసింది. అది కూడా భువనేశ్వర్ నుంచి రైలులో దాదాపు 12 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఒడిశాలోని రాయగడ జిల్లాలో పనిచేయాల్సి ఉంది. అందుకోసం తనను తమ్ముడిని వదిలివెళ్ల లేక ఎంతలా ఏడ్చేదో..నాటి సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు తాను ఐదోతరగతి, తమ్ముడు మూడో తరగతి చదువుతుండే వాళ్లం. సెలవుల కోసం ఇంటికి వచ్చిన తన తల్లి తిరిగి తన ఉద్యోగ స్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లలేక ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగేవి. ఆరోజు పనికోసం ఎక్కడికో ఒక చోటుకి వెళ్లక తప్పదు కదా అని ఓదార్చిన సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేను. 

అంతేగాదు నిట్‌లో చేరేందుకు దాదాపు ₹1.25 లక్షలు అవసరమైతే ఏ మాత్రం ఆలోచించకుండా తన బంగారుపు గాజులను అమ్మేసింది. తాను ఇంటర్న్‌షిప్‌లు సంపాదించుకునేంత వరకు తన కాలేజ్‌ ఫీజులను ప్రతి సెమిస్టర్‌కు ఆమెనే చెల్లిస్తూ వచ్చారు. అలాగే తమ్ముడికి, నాకు రూ. 60 వేలు ఖరీదు చేసే చెరొక ల్యాప్‌టాప్‌ కొనిచ్చింది. తన సంపాదన అంత తక్కువే అయినా..మా కోసం అన్ని చేసింది. తన కోసం అంటూ ఏమి దాచుకోకుండా మొత్తం మాకే ఖర్చు చేసింది. 

అందుకు ఆమెకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ రోజు నేను చేస్తున్నదంతా ఆమె కోసమే. ఆమె మాకు ఇచ్చినదాంట్లో కనీసం కొంత భాగమైన తిరిగి ఇచ్చేలా ప్రయత్నిస్తున్నా. ఆమెకు తగిన జీవితాన్ని అందించడానికి నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉంటాను అంటూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్లు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడమ్‌ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే..)
 

 

#

Tags : 1

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)