క్యారెట్స్‌, ఆపిల్స్‌ తీసుకువెళ్లడం ఎంత పనైపాయే..! ఆ ఎలుగుబంటి..

Published on Mon, 12/08/2025 - 17:16

సర్క్‌స్‌లోనూ, పార్క్‌ల్లోనూ జంతవులకు సంబంధించిన ప్రదర్శనల విషయంలో ఏమరపాటు తగదు. వాటికి ఇబ్బంది కలిగించేలా లేదా అవి టెంప్టయ్యేలా ఆహార పదార్థాలు ఉన్నా..వాటిని కంట్రోల్‌ చేయలేం. అందువల్ల జంతువుల సంరక్షకులు ఆ విషయంలో బీకేర్‌ఫుల​గా ఉండాలి. లేదంటే ఈ కీపర్‌కి పట్టిన గతే పడుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

అసలేం జరిగిందంటే..చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌ సఫారీ పార్క్‌లో జంతువుల సర్కస్‌కి సంబంధించి లైవ్‌ ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల ఎలుగుబంటి జూ కీపర్‌పై దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందో అక్కడున్న పార్క్‌ నిర్వాహకులెవ్వరికీ అర్థం కాలేదు. ఈ అనూహ్య ఘటనకు తేరుకుని అక్కడున్న మిగతా సిబ్బంది ఆ జూకీపర్‌ని ఎలుగుబంటి దాడి నుంచి రక్షించే యత్నం చేశారు. 

కానీ అది మాత్రం అతడిని గట్టిగా పట్టుకుని దాడి చేసేందుకే ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఏదోలాగా జూ సిబ్బంది ఆ ఎలుగుబంటి నుంచి అతడిని రక్షించి..దాన్ని సెల్‌లోకి తరలించారు. అది జూకీపర్‌ సంచి నిండా యాపిల్స్‌, క్యారెట్లు తీసుకురావడం చూసి..టెంప్టయ్యి అలా దాడి చేసిందని జూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే ఆ ఎలుగుబంటి దాడిలో సదరు జూకీపర్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదని, అలాగే ఆ ఎలుగుబంటి కూడా సురక్షితంగానే ఉందని జూ నిర్వాహకులు తెలిపారు. 

ఇక ఆ ఎలుగుబంటిని పబ్లిష్‌ షోల నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. కానీ నెటిజన్లు లాభం కోసం వాటితో అలాంటి పనులు చేయిస్తే ఫలితం ఇలానే ఉంటుందని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.

(చదవండి: షీస్‌ ఇండియా షో..)

 

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)