Breaking News

మూలికా వైద్యం, కోలుకుంటున్న జగన్నాథుడు

Published on Sat, 06/21/2025 - 12:26

భువనేశ్వర్‌: జ్యేష్ట పూర్ఠణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెర చాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు. స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో వైపు యాత్ర దగ్గర పడుతుంది. స్వామి ఆగమనం కోసం భక్త జనం నిరీక్షిస్తోంది. రాజ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు. శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీ మందిరంలో చక్కా విజే సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాటుల్ని రాతి పీఠంపైకి తరలించారు. ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం. భోగ మండప సేవ పూర్తి అయిన తరువాత జయ, విజయ ద్వారం మూసివేసి బెహరణ్‌ ద్వారం తెరిచారు. ధుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను పూజించడం చక్కా విజే సేవగా పేర్కొంటారు. 

దశ మూల మోదకాల వైద్యం 
ఆయుర్వేద పద్ధతులు, గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది. ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషదీయ పదార్థాల్ని నివేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామి కోసం దశ మూలికల మోదకం తయారు చేశారు. శ్రీ మందిరం రాజ వైద్య సేవకులు తరతరాలుగా మహా ప్రభువుని సేవిస్తున్నారు. ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేర్వేరుగా 3 మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీ మందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు.  (Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత)

ఆషాఢ కృష్ణ పక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవ దేవుళ్ల కోసం రాజ వైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశ మూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు. ఆషాఢ కృష్ణ పక్ష ఏకాదశి నాడు మూల విరాటులకు పతి మహాపాత్రొ వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు. పవిత్ర ఏకాదశి తిథి నాడు రాత్రి పూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపాత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు.కోలుకుంటున్న జగన్నాథుడు 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి