Breaking News

Avocado: పోషకాల పండు.. లాభాలు మెండు

Published on Fri, 03/21/2025 - 11:04

విదేశీ పంటలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడా ఇస్తున్నాయి.   

గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్‌ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. 

ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్‌లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. 

కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్‌లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్‌లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు.  

ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు 
చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. 

ఔషధ గుణాలు, పోషకాలు అధికం 
అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్‌ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు  ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. 

చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు 
అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టìకేడి–1, హోస్‌ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్‌ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. 

దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్‌లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. 
– శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,
ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి 

(చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!)

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)