Breaking News

ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్‌ప్యాక్‌

Published on Thu, 04/25/2024 - 14:50

అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ  43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్‌ ప్యాక్‌ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్‌నెస్ జర్నీని, తన  సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. 

2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్‌. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్‌ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్‌స్టా పోస్ట్‌తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్‌. 

కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్‌లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్‌లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్‌గా స్వీకరించి చేసి చూపించాడు.

రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్‌నెస్‌ను, 6 ప్యాక్‌ను సాధించాలనుకున్నా, సెకండ్‌ లైఫ్‌కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్‌పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌ అంటూ కమెంట్‌ చేశారు. 

Videos

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)