Breaking News

ఆ ఆటో డ్రైవర్‌ ఆంగ్ల భాష వాక్పటిమకు.. ఆస్ట్రేలియన్‌ డ్రైవర్‌ ఫిదా..!

Published on Fri, 11/14/2025 - 13:25

సాధారణ మనుషుల ఉండే కొందరూ దగ్గర అపార జ్ఞానం ఉంటుంది. వాళ్లని పలకిరిస్తే లేదా మాట కలిపితే గానీ మనకు తెలియదు. మంచి మనసు అనేది విద్య, డబ్బు, హోదా వల్ల వస్తుందనుకుంటే పొరపాటే అని ఆయా వ్యక్తులు తారసపడగానే అర్థమవుతుంది. అలాంటి అపురూపమైన భావోద్వేగ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..విదేశీ పర్యాటుకులు మన సుందర నగరాలకు ఆతిధ్యానికి వస్తుంటారనే విషయం తెలిసిందే. అలానే ఆస్ట్రేలియాకు చెందిన విల్‌ స్ట్రోల్స్‌ మన భారతదేశంలోని నగరాలను వీక్షిస్తూ..ఓ ఆటోలో ప్రయాణించాడు. ఆ ఆటో డ్రైవర్‌తో కాసేపు మాటలు కలిపాడు. ఆ డ్రైవర్‌ అతడిని చూసి మీరు ఆస్ట్రేలియన్‌ నుంచి వచ్చారా..?అని ఆంగ్లంలో చాలా చక్కగా ప్రశ్నిస్తాడు. అందుకు విల్‌ అవునని సమాధానం ఇవ్వడం తోపాటు అంతలా సులభంగా అతడిని ఆస్ట్రేలియన్‌ అని ఎలా గెస్‌ చేయగలిగాడో కూడా వివరిస్తాడు. 

తాను ఆస్ట్రేలియాకు వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు చెఫ్‌గా పనిచేశానని అంటాడు. వెంటనే విల్‌ అయితే మీరు ప్రస్తుతం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అందుకు డ్రైవర్‌ భలే అ‍ద్భుతంగా మాట్లాడాడు. అవి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన గొప్ప జీవిత పాఠాలు. 

ఇంతకీ ఆ డ్రేవర్‌ ఏమన్నాడంటే..
తాను ఆనందంగా జీవించే వ్యక్తినని సగర్వంగా చెప్పాడు. తాను డబ్బు మనిషిని కానని, జీవితానికి డబ్బు అవసరమే కానీ, డబ్బే జీవితం కాదు. అని చాలా చక్కగా చెబుతాడు. అతడి ఆంగ్ల వాక్‌ చాతుర్యానికి సదరు ఆస్ట్రేలియన్‌ విల్‌ అబ్బురపడతాడు. అంతేగాదు మంచి చాయ్‌ తాగుతారా తీసుకెళ్తాను అంటూ మంచి ఆఫర్‌ కూడా ఇస్తాడు ఆ డ్రైవర్‌. విల్‌ అతడి సహృదయతకు ఇప్రెస్‌ అయ్యి అందుకు అంగీకరిస్తాడు. వెంటనే డ్రైవర్‌ తనకు ఎంతో ఇష్టమైన చాయ్‌ కేఫ్‌కు తీసుకెళ్తాడు. 

అక్కడ టీ సర్వ్‌ చేసే వ్యక్తి కూడా చక్కగా ఆంగ్లంలో మాట్లాడి విల్‌ని ఆశ్చర్యపరుస్తాడు. ఇక ఆ టీ చెఫ్‌ కూడా తాను స్పెషల్‌గా తయారు చేసి టీ అని కాసింత గర్వంగా చెబుతాడు. ఆ తర్వాత ఆటో డ్రేవర్‌ ఆ ఆస్ట్రేలియన్‌ నివాసి విల్‌ని తన గమ్యస్థానానికి చేర్చగానే ..అతడు ఇంతలా తనకోసం కష్టపడినందుకు ఈ డబ్బులు తీసుకోవాల్సిందే అంటూ చేతిలో కొంత మొత్తం పెట్టి మరి వెళ్లిపోతాడు.

అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేయగానే..అంతా ఆ ఆటో డ్రైవర్‌ ఆంగ్ల భాష వాక్పటిమ అదుర్స్‌ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడమే కాదు ఇవాల్టి గొప్ప జీవిత పాఠం.."జీవితానికి డబ్బు అవసరం అంతే డబ్బే జీవితం కాదు". అని కామెంట్లు చేస్తూ  పోస్టులు పెట్టారు.

 

(చదవండి: భాగ్యనగరంలో లెర్న్‌ విత్‌ భీమ్‌..!)

Videos

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

నాపేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించారు:సజ్జనార్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)