Breaking News

వెంటాడి వేటాడేసింది.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

Published on Thu, 06/27/2024 - 13:35

విశ్వాసానికి పెట్టింది  పేరు శునకం. పెంపుడు జంతువుల్లో బాగా  పాపులర్‌ అయింది కూడా కుక్క. ఇంటి యజమాని, కుటుంబం ఏదైనా అనుకోని  ప్రమాదంలో పడినపుడు చాకచక్యంగా వ్యవహరించి కాపాడుతుంది.  ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ విశ్వాసాన్ని చాటుకుని హ్యాట్సాఫ్‌ అనిపించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే పగబట్టి, వెంటాడి వేటాడిన ఘటనలు చాలా అరుదు కదా. ఇలాంటి ఘటన ఒకటి  అట్లాంటాలో చోటు చేసుకుంది.

వివరాలను పరిశీలిస్తే..తన యజమాని కుటుంబానికి చెందిన  గొర్రెలు, మేకల మందకు కాపలాగా ఉంది ఒక కుక్క. దాని పేరు కాస్పర్.  ఒకరోజు గొర్రెలమందపై  ఒక్కసారిగా 13 తోడేళ్ల గుంపు (కొయెట్, అమెరికన్ జాకల్) దాడి చేసింది దీంతో అక్కడే  ఉన్న  కుక్క వాటిపై ఎటాక్‌ చేసింది. ఎనిమిదింటిని అక్కడికక్కడే చంపేసింది.

ఇంతటితో దాని కోపం చల్లారలేదు.  నాలుగు రోజులు అదృశ్యమై, వాటిని వెదికి పట్టుకొని మరీ వేటాడి, మిగిలిన  ఐదు తోడేళ్ల పని  కూడా పట్టింది.  ఆ తర్వాత మాత్రమే ఇంటికి చేరింది. 

తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన దాన్ని చూసి, ఇక బతకదని భావించారట దాని  యజమాని వీర్‌విల్లే.  ఆ తరువాత కొంతకాలం లైఫ్‌లైన్ యానిమల్ ప్రాజెక్ట్ సంరక్షణలో కోలుకుంది హీరో కాస్పర్‌. గత ఏడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టా,, ఎక్స్‌లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

 

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)