Breaking News

ఆ రూ. 500 ‍కోట్లు డీల్‌..దెబ్బకు డ్రైవర్‌ తీరు మారిందిగా..!

Published on Mon, 11/03/2025 - 11:42

డబ్బు దేన్నైనా మార్చేయగలదు. అది మనుషుల దగ్గర ఉంటే..ఒక్కసారిగా వారి రేంజే మారిపోతుంది. మాట తీరు మారిపోతుంది. అందుకు నిదర్శనం ఈ సీఈవోకి ఎదురైన ఘటనే. అప్పటి వరకు సీఈవో దగ్గర నార్మల్‌గా పనిచేసిన వ్యక్తిలో..ఒ‍క్కసారిగా అనూహ్యమైన మార్పు. విస్తుపోవడం సీఈవో వంతైంది. ఆ తర్వాత గానీ తెలియదు అసలు కారణం ఇది అని. 

ఇంతకీ ఏం జరిగిందంటే..ఆస్ట్రోటాక్‌ సీఈవో పునీత్‌ గుప్తా ఇటీవల కొత్తగా కారు ‍డ్రైవర్‌ని నియమించుకున్నారు. పనిలో జాయిన్‌ అయిన రెండు రోజులు సాధారణంగానే పనిచేశాడు. మూడోవ రోజు..ఏకంగా ఆఘ మేఘాల మీద పునీత్‌ గుప్తాకి ఎదురొచ్చి డోర్‌ ఓపెన్‌ చేసి స్వాగతం పలికాడు. ఈ అనుహ్య చర్యకు విస్తుపోయిన సీఈవో..ఇంత హడావిడి ఏం అవసరం లేదు. కారు స్టార్ట్‌ చేసి ఉంటే తాను ఎక్కగానే కారు వెళ్లిపోయేది కదా అని చీవాట్లు పెట్టారు పునీత్‌ గుప్తా. 

పైగా మరోసారి రిపీట్‌ అవ్వనివ్వద్దు, కేవలం టైం వేస్ట్‌ అవ్వకుండా చూసుకో చాలు అని కాస్త గట్టిగా చెప్పారు. కానీ కారు డ్రైవర్‌ మాత్రం తన పనే తాను చేసుకుంటున్నానని చెప్పే యత్నం చేసినా..గుప్తా అలా వద్దని వారించారు. ఆ తర్వాత ఇన్ని రోజులు నార్మల్‌గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటా అని ఆలోచించారు గుప్తా. అప్పుడే గుర్తొచ్చింది. ఇందాక ఫోన్‌ కాల్‌లో రూ. 500 కోట్ల ఒప్పందం గురించి మాట్లాడానని, బహుశా దానివల్లే ఇతడిలో ఇంత మార్పు వచ్చిందా అని విస్తుపోయారాయన. 

డబ్బు నిజానికి ఎవ్వరినైనా మార్చేస్తుంది. అంటూ తనకు జరిగిని అనుభవాన్ని నెట్టింట షేర్‌ చేసుకున్నారు. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌పై మిశ్రమంగా స్పందించారు. కొందరు డ్రైవర్‌ అంకితభావంతో పనిచేస్తున్నాడని పేర్కొనగా, మరికొంతమంది కోట్లు గురించి వినగానే బ్రో  'కార్పొరేట్ డ్రైవర్ మోడ్'ని అన్‌లాక్ చేసాడు" అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్‌ జాబ్‌ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..)

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)