Breaking News

గర్విష్టి గజరాజు

Published on Sun, 06/21/2026 - 10:34

అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక గజరాజు ఉండేది. దానికి తన బలమన్నా, భారీ శరీరమన్నా చాలా గర్వం. ‘ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.

అదే అడవిలో చింటూ అనే ఒక తెలివైన చిన్న కుందేలు ఉండేది. అది చాలా మంచిది. అందరితోనూ స్నేహంగా ఉండేది.
ఒకరోజు గజరాజు అడవిలో గంభీరంగా నడుచుకుంటూ వెళ్తుండగా, దారిలో ఉన్న చింటూను గమనించకుండా దాని కాలిని తొక్కింది. పాపం! చింటూ నొప్పితో ‘అమ్మా!’ అని అరుస్తూ పక్కకు పడిపోయింది. 
గజరాజు అది చూసి కూడా కనీసం క్షమాపణ చెప్పలేదు. పైగా, ‘నువ్వు చాలా చిన్నదానివి, నా కాళ్ల కింద పడకుండా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో’ అని ఎగతాళి చేసి వెళ్ళిపోయింది. 
చింటూ బాధతో కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

కొన్ని రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. వారు గజరాజును పట్టుకోవడానికి ఒక బలమైన ఉచ్చు పన్నారు. గజరాజు అజాగ్రత్తగా వెళ్తూ ఆ వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటకు రాలేకపోయింది. ఆ వల విడిపోలేదు, సరిగదా ఇంకా బిగుసుకుపోయింది. దానితో సహాయం కోసం గజరాజు బిగ్గరగా అరిచింది. ఆ అరుపులు విన్న మిగిలిన జంతువులు ‘గర్విష్టి గజరాజుకు తగిన శాస్తి జరిగింది’ అని అనుకున్నాయే తప్ప రక్షించడానికి రాలేదు. కానీ చింటూ ఆ అరుపులు విని ఆగలేకపోయింది. వెంటనే గజరాజు ఉన్న చోటికి పరుగెత్తింది. వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న గజరాజును చూసి చింటూ మనసు కరిగింది.

‘భయపడకు గజరాజా! నేను ఇప్పుడే వస్తాను’ అని చెప్పి ఊరడించింది. తరువాత చింటూ వేగంగా వెళ్లి తన స్నేహితులైన ఎలుకల సైన్యాన్ని తీసుకువచ్చింది.
చింటూ ఆజ్ఞతో ఎలుకలన్నీ కలిసి తమ పదునైన పళ్ళతో ఆ బలమైన వల తాళ్లను కొరకడం మొదలుపెట్టాయి. చూస్తూ ఉండగానే వల ముక్కలైపోయింది. గజరాజు బంధవిముక్తురాలైంది! 
వల నుండి బయటకు వచ్చిన గజరాజు కళ్లలో నీళ్లు తిరిగాయి.

అది మెల్లగా చింటూ దగ్గరకు వచ్చి, ‘చింటూ! నన్ను క్షమించు. నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నీలాంటి చిన్న ప్రాణియే. బలం శరీరంలో కాదు, చేసే సాయంలో ఉంటుందని తెలుసుకున్నాను’ అని వినయంగా చెప్పింది.
చింటూ నవ్వుతూ, ‘అపకారికి కూడా ఉపకారం చేయాలన్నదే మా అమ్మ నేర్పిన పాఠం. ఇకపై మనమందరం స్నేహితులుగా ఉందాం’ అంది.
ఆ రోజు నుండి గజరాజు తన గర్వాన్ని వదిలేసి, అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా మెలుగుతూ అందరికీ రక్షణగా నిలిచింది. ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.

హితవచనం..
అలముదకేన తృణైర్వా మనస్వినా ప్రాణధారణా కార్యా
నా సంస్కృతశ్చ పురుషః ప్రాకృతసత్త‍్వః ప్రణయతవ్యః
- ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకులు అలములు తినిగాని, కేవలం మంచినీళ్లు తాగిగాని ప్రాణాలు నిలబెట్టుకుంటాడే తప్ప నీచులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడు. - అవ్యాన్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)