Breaking News

ఒంటరి జీవుల వింత యాప్‌.. అత్యధిక డౌన్‌లోడ్‌లతో..

Published on Tue, 01/13/2026 - 13:39

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరిగా  ఉండాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఒంటరితనం అనేది ఒక సామాజిక అంశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉండేవారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రూపొందించిన ‘ఆర్ యూ డెడ్?’ (Are You Dead?) అనే మొబైల్ యాప్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది.

ఈ యాప్ గత మే నెలలో ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్‌గా నిలిచింది.  ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యానికి గురైనా  ఆ సమయంలో తలెత్తే భయాన్ని ఈ యాప్ పోగొడుతోంది. ఈ యాప్‌లో క్లిష్టమైన ఫీచర్లు లేదా నిరంతర ట్రాకింగ్ అనేది ఉండదు. యాప్‌ యూజర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి యాప్‌ను ఓపెన్ చేసి, తాము క్షేమంగా ఉన్నామని నిర్ధారించడానికి స్క్రీన్‌పై  కనిపించే బటన్‌ను నొక్కాలి.

ఒకవేళ వినియోగదారుడు నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే, యాప్ వెంటనే అత్యవసర కాంటాక్ట్ నంబర్‌కు సందేశాన్ని పంపుతుంది. తద్వారా సదరు వ్యక్తికి ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చని వారి సన్నిహితులు గ్రహించి, వెంటనే స్పందించేందుకు అవకాశం  ఏర్పడుతుంది. ప్రారంభంలో ఉచితంగా లభించిన ఈ యాప్, ప్రస్తుతం 8 యువాన్ల (సుమారు రూ. 95) ధరతో అందుబాటులో ఉంది. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య 20 కోట్లకు చేరుకోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

వృద్ధాప్యం, ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లడం మారుతున్న సామాజిక పరిస్థితుల  కారణంగా ఈ యాప్  ఆదరణం పొందుతోంది. ఈ యాప్ పేరు ‘ఆర్ యూ డెడ్?’ (మీరు చనిపోయారా?) అని ఉండటంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరు  ప్రతికూలంగా ఉందని కొందరు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ‘ఆర్ యూ అలైవ్?’ లేదా మరేదైనా పేరు పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు యాప్ పేరును మార్చడంపై ఆలోచిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి

Videos

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)