Breaking News

అత్యంత అరుదైన పావురం!చూస్తే..షాకవ్వడం ఖాయం

Published on Tue, 09/19/2023 - 09:53

పావురం అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. పూర్వం వాటిని సమాచారాన్ని చేరే వేసే సాధనాలుగా ఉపయోగించేవారు. ఇటీవల ఈ పావురాలను పెంచేందుకు భయపడే పరిస్థితులు తలెత్తాయి కూడా. వాటి విసర్జకాల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని పలువురు హెచ్చరించడం జరిగింది. దీంతో ఒకరకంగా వాటిని పెంచడం, ఆహారం వేయడం తగ్గించారు ప్రజలు. వాటి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా. ఇలా ఉండగా గూలాబీ రంగులో ఉన్న ఓ పావురం ప్రజల ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది.

యూకేలోని గ్రేట్‌ మాంచెస్టర్‌ వద్ద టౌన్‌ సెంటర్‌  సమీపంలో వాకింగ్‌ చేసేవాళ్లు ఓ పక్క, మరోవైపు పోలీసుల పెట్రోలింగ్‌తో జన సందోహంగా ఉన్న ప్రదేశంలో ఈ పక్షి కనువిందుఉ చేసింది. ఏదైన రంగు దానిపై పడటం వల్ల అలా ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. నిజానికి పావురాలు తెలుపు, నలుపు, బుడిద రంగులోనే ఎక్కువగా ఉంటాయి. అవేమి కాకుండా పింక్‌ రంగులో ఉండడం అనేది అత్యం అరుదు అనే చెప్పాలి. మొదటగా చూసిన వెంటనే దాన్ని పావురమే ప్రజలు అనుకోలేదు. ఏదో వింత పక్షి అనే అనుకున్నారు అంతా.

కాసేపటికి గానీ అర్థకాలేదు అది పింక్‌కలర్‌లో ఉన్న ఓ పావురమేనని. ఇదిలా ఉండగా గతంలో న్యూయార్క్‌ నగరంలో జెండర్‌ రివీల్‌ పార్టీలో అట్రాక్షన్‌ కోసం అని ఓ పావురానికి గూలాబిరంగు వేసి ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పావురాన్ని రక్షించడమే గాక అది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాన్ని వైల్డ్‌ బర్డ్‌ ఫండ్‌కు తరలించారు. అలానే ఈ పక్షికి కూడా ఎవరైన గూలాబీ రంగు వేశారేమోనని సందేహిస్తున్నారు.

అయితే ఈ పావురం బంధింపబడలేదు. మిగతా పావురాల్లో స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించింది. ఎందువల్ల ఆ పావురం ఇలా గూలాబీ రంగులో ఉందనేది తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫోటోను నెట్టింట తెగ వైరల్‌ అవ్వడంతో చూసిన యూకేలోని స్థానికులు, పోలీసు అధికారులు తాము కూడా ఈ వింత పావురాన్ని చూసినట్లు తెలపడం విశేషం. 

(చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..)

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)