Breaking News

స్థిరత్వం, నిలకడ బుద్దికోసం..!

Published on Sat, 03/22/2025 - 14:20

ఆంజనేయాసనం అనేది యోగాలో ఒక భంగిమ. దీనిని క్రెసెంట్‌ మూన్‌ పోజ్‌ అని కూడా అంటారు. ఈ ఆసనం హనుమంతుడి తల్లి అంజన చేసే నృత్య భంగిమలోదిగా చెబుతారు. అందుకే ఈ ఆసనానికి ఆంజనేయాసనం అని పేరు.  

ఈ ఆసనం ప్రయోజనాలు...

శరీరాన్ని ఒక కాలు మీద స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమతుల్యత కలుగుతుంది. స్థిరత్వం మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి– మనసుకు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. 

హిప్‌ భాగం ఫ్లెక్సిబుల్‌ అవుతుంది. శరీరంపై అవగాహన కలుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల పనితీరును, ఉచ్ఛ్వాస–నిశ్వాసలను మెరుగు పరుస్తుంది. మానసిక, శారీరక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దిగువ శరీరాన్ని సాగదీయడానికి, ఛాతీని విశాలం చేయడానికి ఈ ఆసనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

ఎలా చేయాలంటే... 

  • ఎడమ మోకాలిని ముందుకు చాపి, కుడి కాలిని వెనక్కి వంచి, కుడి కాలి మునివేళ్లమీద ఉండాలి. 
  • తలను నిటారుగా ఉంచి, రెండు చేతులను కంటికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉంచాలి. 
  • ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. 
  • శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ మనసును స్థిరంగా ఉంచే ఈ ఆసనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆసనాన్ని సాధనం చేయడం వల్ల మానసిక వికాసం కూడా మెరుగవుతుంది.  

(చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..)

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)