Breaking News

సీఈవోగా గృహిణి..! ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో..

Published on Tue, 05/27/2025 - 11:22

మధ్యతరగతిలో పెరిగిన ఆమె పార్ట్‌ టైం జాబ్‌లు చేసి మరీ అమెరికా చదువుని పూర్తి చేసింది. చిన్నా.. చితక స్టోర్‌ల నుంచి ఆభరణాల స్టోర్‌ వరకు ప్రతిదాంట్లో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తూ..తన కాబోయే భర్తను కలుసుకుంది. అతడు కూడా ఆమెలానే రెస్టారెంట్‌ అంతస్తులు శుభ్రం చేసే హౌస్‌ కీపింగ్‌ స్థాయి నుంచి ఓ కంపెనీని స్థాపించే రేంజ్‌కి ఎదిగిన వ్యక్తి. ఇద్దరి కష్టపడేతత్వం, అభిరుచులు ఒక్కటై..స్నేహితులుగా, ఆ తర్వాత జంటగా మారారు. అలా ఇరువురు మంచి వ్యాపారవేత్తలుగా మారినా..గృహిణిగా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడక తన కాళ్లపై తాను నిలబడేందుకే మక్కువ చూపించింది. అలా ఆమె అనతికాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుని..అత్యంత లగ్జరీయస్‌ భవంతిలో నివాసం ఉండే స్థాయికి చేరుకున్నారామె. ఇప్పటికీ తనకు భర్త సంపాదనపై ఆధారపడి బతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదని చెబుతోంది. మరీ అంతలా సక్సెస్‌ని అందుకున్న ఆ గృహిణి ఎవరంటే..

విలాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఆ గృహిణే దుబాయ్‌కి చెందిన అనితా సురానీ. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె, అమెరికాలో చదువుకు కొనసాగించడానికి ఎన్నో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసేది. ఒక కన్వీనియన్స్‌ స్టోర్‌ నుంచి జ్యువెలరీ స్టోర్‌ వరకు..ఇలా ప్రతి చిన్న పార్ట్‌ టైం ఉద్యోగాన్ని వదులుకోకుండా ఆహర్నిశలు కష్టపడి అమెరికా చదువుని విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలో అనిత తన ఇంటీరియర్‌ డిజైన్‌కి సంబంధించిన వ్యాపారం చేసే యత్నంలో ఉండగా..తన కాబోయే భర్త వ్యాపార భాగస్వామి  మోయిజ్‌ ఖోజాను కలిసింది. 

మోయిజ్‌ కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. అతడు కూడా ఒకప్పుడు రెస్టారెంట్ అంతస్తులను శుభ్రం చేసి, విజయవంతమైన టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. అతనితో కలిసి అనిత టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించింది. వ్యాపారభాగస్వాములుగా ఉన్న ఇద్దరు జీవిత భాగస్వాములయ్యారు. తమ వ్యవస్థాపక ప్రయాణం  ఒక అమెరికన్ మాల్‌లోని ఒక చిన్న సెల్ ఫోన్ కియోస్క్‌తో ప్రారంభమైందని చెబుతోంది అనిత. 

అలా అలా విస్తరించి ఇవాళ దాదాపు 100కు పైగా దుకాణాలతో రిటైల్‌ సామ్రాజ్యంగా విస్తరించిందని తెలిపింది. ఇక మోయిజ్‌ ఈ రిటైల్‌ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా..అనిత తన ఇంటీరియర్ డిజైన్ పట్ల ఉన్న ఆసక్తితో అటువైపుగా తన వ్యాపారాన్ని నిర్మించాలనుకుంది. అందుకోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక అనుభవజ్ఞుడైన సహోద్యోగితో భాగస్వామ్యం కుదుర్చుకుని..దుబాయ్‌లో జేనా ఇంటీరియర్స్‌ను ప్రారంభించింది. 

చూస్తుండగానే అతి కొద్దికాలంలో అనిత డిజైన్‌ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. జస్ట్‌ ఇద్దరు వ్యక్తుల నుంచి  ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లతో సహా 40 మందికి పైగా ఉద్యోగులకు విస్తరించింది. అయితే తన సక్సెస్‌కి ప్రేరణ తన కుమార్తె జెనా అని అంటోంది. జీవితాన్ని సమతుల్యం చేసుకునేలా ఎలా మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలో తన కూతురు చూపించాలనేదే తన ధ్యేయమని, అందుకోసమే ఓటమిని దరిదాపుల్లోకి రాకుండా కష్టపడతానని చెబుతోంది. అందుకోసమే తన కంపెనీకి కూడా తన కూతుర జెనా పేరుని పెట్టానని చెబుతున్నారామె. అనితా జెనా బోటిక్‌ కంపనీని కూడా నిర్వహిస్తోంది. ఇందులో అంతా మహిళా ఉద్యోగులే పనిచేస్తారని చెబుతోంది. 

లగ్జరీ భవంతి..
ఆమె దుబాయ్‌ ఇల్లు అత్యంత లగ్జరీయస్‌గా..రెండు కళ్లు సరిపోవేమో..! అన్నంత అందంగా ఉంటుందట. ఆమె ఇంటి సీలింగ్‌ 24-క్యారెట్ల బంగారంతో చేసి ఉంటుందట. ఆమె ఆఫీస్‌ కూడా అంతే అందంగా లగ్జరీయస్‌ ఉంటుందట. అయితే అనిత తన వ్యాపారానికి నిధులు సమకూర్చుకోవడానికి కుటుంబ సంపదపై అస్సలు ఆధారపడదట. ఎందుకంటే తన భర్త స్పష్టమైన ఆర్థిక సరిహద్దులను నిర్దేశించారట, అందుకనుగుణంగానే నడుచుకుంటానంటోంది. 

తన ఆఫీస్‌ పెట్టుబడిని తిరిగి చెల్లించడమే గాక ఉద్యోగుల జీతాలను కూడా తానే భరిస్తానంటోంది. ఆ ఒత్తిడే ఆమెను మరింత కష్టపడి పనిచేసేలా చేసి, కంపెనీ అభివృద్ధి దోహదపడుతుందని చెబుతోంది. అంతేకాదండోయ్‌ అనిత డబ్బుని ఆర్చించేలా కష్టపడి పరిచేస్తా..అలాగే సంపాదించినదంతా ఖర్చు పెట్లేందుకు వెనకడుగు వేయను అని తేల్చి చెబుతోంది. పైగా అందులో ఉన్న సంతృప్తే 'వేరేలెవెల్‌' అని  చెబుతోంది అనిత.

(చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)