తాడిపత్రిలో TDP అరాచకాలు మితిమీరాయి: పెద్దారెడ్డి
Breaking News
ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!
Published on Tue, 09/16/2025 - 12:27
గుండె వ్యాధులు ఎక్కువగా పురుషులనే ప్రభావితం చేస్తాయని, అందులోనూ కరోనరి ఆర్టరీ డిసీజ్ వంటి గుండె సమస్యలు పురుషులకే అత్యంత ప్రమాదమని అనుకుంటారు అంతా. కానీ మహిళలకూ అంతే స్థాయిలో ప్రమాదం ఉంటుందట. వాళ్లు కూడా తరుచుగా ఆంజినా(ఛాతీనొప్పి) వంటి లక్షణాలను ఎదుర్కొంటారట. అయితే ఈ ఛాతీనొప్పిని మహిళలు తేలిగ్గా కొట్టిపారేయడం, సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలపై కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఛాతీనొప్పిపై అవగాహన లేమి దీనంతటికి కారణమని అంటున్నారు. మరీ ఏంటి ఛాతీనొప్పి, దాని లక్షణాలు, ముందుస్తుగా ఎలా గుర్తించాలి తదితరాల గురించి వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.
భారతదేశంలో చాలావరకు సంభవిస్తున్న మరణాల్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అంతేగాదు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం..2022లో భారతదేశంలో దాదాపు 4 మిలియన్లకు పైగా మరణాలు క్యాడ్ వల్లే సంభవించాయి. పైగా ఈ గణాంకాలు మహిళలకు ఈ వ్యాధిపై తక్షణ అవగాహన, సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం గురించి నొక్కి చెప్పాయి. అందువల్ల ఈ ఆంజినా పెక్టోరిస్‌ని(ఛాతీనొప్పి)ని ముందస్తుగా గుర్తించడం, సమర్థవంతంగా నిర్వహించడంపై మహిళలకి అవగాహన పెంచడం అనేది అత్యంత ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆంజినా (ఛాతీనొప్పి) ఎలా ఉంటుందంటే..
ఆంజినా అనేది క్యాడ్(CAD)కి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలను ఎదుర్కొంటారట. ఇది రోగి జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందనప్పుడు వచ్చే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. దీని వలన ధమనులు సంకోచించి, గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది.
ఆంజినా లక్షణాలు ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలోకి వ్యాపించడం, శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, చెమటలు పట్టడం వంటివి ఉండవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ కానప్పటికీ, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది.
పైన పేర్కొన్న ఆ సమస్యల ఉత్పన్నమవ్వగానే సకాలంలో వైద్య సహాయం తీసుకోకపోవడంతోనే ఈ ఆంజినా సవాలుగా మారుతుందని చెబుతున్నారు వైద్యులు. మహిళల్లో ఈ సమస్య నిర్థారణలో చేస్తున్న జాప్యమే సమస్య తీవ్రతను పెంచి, అకాల మరణాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ నిర్లక్ష్యమే ఒక్కోసారి నిపుణులు సైతం అంతర్లీనంగా ఉన్నీ ఆంజినా సమస్యను పరిష్కరించకుండా ఇతరత్ర ఉపశమన పరిష్కారాలు అందించేలా చేసి, మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు.
చికిత్స విధానం..
OPTA(ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆంజినా) క్లినికల్ చెక్‌లిస్ట్, OPTA ప్రశ్నాపత్రం, OPTA విధానంతో సహా మూడు ప్రత్యేకమైన సాధనాలు వరుసగా ఆంజినా(ఛాతీనొప్పి) నిర్థారణకు కీలకమైనవి. ఇవి రోగ నిర్థారణకు, వైద్య నిర్వహణకు మద్దతిస్తాయి. పైగా వైద్యలకు సకాలంలో ఈ ఛాతీనొప్పిని నిర్థారించడంలో హెల్ప్ అవుతుంది. ఇది ఒకరకంగా ఆంజినా నిర్వహణపై తొలి అడుగుగా అభివర్ణించారు నిపుణులు.
మహిళ్లలోనే ఈ వ్యాధిని గుర్తించలేకపోవడానికి రీజన్..
మహిళల్లో గుండె జబ్బులను గుర్తించడంలో ఒక ప్రధాన సవాలు ఏంటంటే..సహజంగా తాము తక్కువ ప్రమాదంలో ఉన్న అపోహనే ప్రధాన కారణమని చెబుతున్నారు అపోలా ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సరితా రావు. అదీగాక గుండెజబ్బులు వంటి సమస్యలు తరుచుగా పురుషులే బారిన పడతారనేది నిజమే అయినప్పటికీ, పూర్తిగా మహిళలకు ఈ వ్యాధుల రావు అని అర్థం కాదని అంటున్నారు.
అందువల్లే ఈ గుండె జబ్బుల ప్రమాదాలపై మహిళలకు అవగాహన కలిగించడం అత్యంత ప్రధానమని నొక్కి చెబుతున్నారు. 75 ఏళ్లు పైబడిన హృదయ సంబంధ రోగుల్లో మహిళలే అధికమని చెప్పారు. ముఖ్యంగా ఆంజినా(ఛాతీనొప్పి)తో ముడిపడి ఉన్న గుండెజబ్బులు పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల మహిళలు ఈ వ్యాధిని తిప్పికొట్టేలా రోగ నిర్థారణ, సకాలంలో చికిత్స, నిర్వహణపై ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి మెరుగైన ఫలితాలు అందుకునేలా చర్యలు తీసుకోవడం అనేది అత్యంత కీలకమని అన్నారు.
(చదవండి: Pain Relief Therapy: నొప్పిని పోగొట్టే ‘అయాన్’)
Tags : 1