Breaking News

నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్‌వీడియో

Published on Wed, 06/26/2024 - 17:36

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ , బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తొలి ఆహ్వానాన్ని శివుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా కాశీ లేదా బనారస్ నగరంలో చాట్‌ను ఆస్వాదించిన  వీడియో వైరల్‌ అయింది. అంతేకాదు  భర్త ముఖేష్‌ అంబానీకి చాట్‌లు అంటే చాలా ఇష్టమని ప్రస్తావించారు. ఇపుడు ముఖేష్‌ ఉండి ఉంటే దీన్ని ఇష్టపడి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టమట ఒకసారి ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడని చెబుతారు.

 కాశీలో నీతా  అంబానీ మనసు దోచుకున్న స్నాక్‌ బనారస్ టమాటా చాట్. పాపులర్‌  కాశీ చాట్‌ భండార్‌లో  చాట్‌ను ఆస్వాదించారు. అలాగే స్థానిక సంస్కృతి , సంప్రదాయాల గురించి ముచ్చటించడం విశేషంగా నిలిచింది. పనిలో పనిగా చాట్‌ రెసిపీని కూడా దుకాణదారుడిని కూడా అడిగి తెలుసుకున్నారు. బనారస్‌లో  ఇది  పాపులర్‌. దేశ విదేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా దీన్ని టేస్ట్‌ చేస్తారట. 

 

దాదాపు పదేళ్ల తర్వాత  కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నానంటూ నీతా ఉద్వేగానికి లోనయ్యారు. "గంగా హారతి సందర్భంగా ఇక్కడికి రావడం నా అదృష్టం. చాలా బాగుంది.. ఇక్కడ  గొప్ప శక్తి ఉంది’’ అన్నారామె.

కాగా అనంత్- రాధిక పెళ్లి బాజాలు జూలై 12న మోగనున్నాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)