Breaking News

ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..!

Published on Tue, 12/02/2025 - 13:13

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలను  పంచుకుంటూ తన అభిమానులను చైతన్యపరుస్తుంటారు. ఈసారి అలానే సరికొత్త ప్రేరణాత్మక స్టోరీతో ముందుకొచ్చారు. ఈసారి గ్రామాలకు స్ఫూర్తిని కలిగించే కథను షేర్‌ చేశారు. ఆ గ్రామం స్మార్ట్‌ డెవలప్‌మెంట్‌కి ఫిదా అవ్వతూ నెట్టింట ఎలా ఆ గ్రామం అభ్యున్నతి వైపుకి అడుగులు వేస్తూ సరికొత్త మార్పుకి బీజం వేసిందో వివరించారు. డెవలప్‌మెంట్‌ అనగానే డబ్బు, మౌలిక సదుపాయాలు ఉంటేనే సాధ్యం అనుకుంటే పొరపాటే అంటున్నారు మహీంద్రా. మరీ ఈ గ్రామం ఎలా ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచిందో తెలుసుకుందామా..!

మహారాష్ట్రలోని టాడోబో నేషనల్ పార్క్ సమీపంలోని సతారా నెవార్ అనే గ్రామం ఆనంద్‌ మహాంద్రా మనసుని దోచుకుంది. క్రమశిక్షణకు, స్థిరమైన జీవన విధానానికి ఈ గ్రామం చక్కని రోల్‌ మోడల్‌ అంటూ ఆ గ్రామం విశిష్టత గురించి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు అర్థవంతమైన మార్పు అనేది గొప్ప నాయకత్వం, సాముహిక శక్తి నుంచి వస్తుందనేందుకు ఈ గ్రామమే ఒక ఉదాహరణ అని నొక్కి చెప్పారు.

ఒకప్పుడూ ఈ సతారా నెవార్ గ్రామం ఇతర గ్రామాల మాదిరిగానే పరిశభ్రంగా లేక, వనరుల కొరతతో అధ్వాన్నంగా ఉండేది. అయితే స్థానిక నాయకుడు గజానన్  ఐదేళ్ల పాటు ఆచరణాత్మకమైన సంస్కరణల ప్రణాళికలు అమలయ్యేలా ప్రజలందర్నీ ఒప్పించి.. ఆ మార్గంలో ముందుండి నడిపించారు. ఈ గ్రామంలో మొత్తం ప్రజలకు అవసరమయ్యే ఉచిత వేడి నీటి వ్యవస్థ ఉంది. అది కూడా సౌరశక్తితో. అంతేగాదు నీటి ఏటీఎం కార్డుతో యాక్సెస్‌ అయ్యే కమ్యూనిటీ ఆర్‌ఓ వ్యవస్థ ఉంది. దీని సాయంతో శుద్ధి చేసిన తాగునీరు, అలాగే ప్రతి ఇంట్లో మీటర్‌తో కనెక్ట్‌ అయిన నీటి కుళాయిలు ఉన్నాయి. 

అలాగే ఓపెన్‌ డ్రెయిన్‌ వ్యవస్థను తొలగించారు. ప్రతి సాయంత్రం వీధులు చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే వీధి దీపాలు సైతం సౌరశక్తితో వెలుగుతాయి. అంతేగాదు ఎవ్వరైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడితే గనుక రూ. 500ల దాక జరిమాన విధించబుడుతుంది. ఇది అన్ని వయసులన వారికి వర్తిస్తుందట. ఇక్కడి పిల్లలు సైతం పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారట. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు అది మన గర్వానికి కారణమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారట. 

గ్రామస్తులు ప్రతి సౌకర్యాన్ని అందరూ కలిసి నిర్వహిస్తారు, అందుకు కావాల్సిన నిధులను వారే సమకూర్చుకుంటారట. అలా సమాజ అభివృద్ధిలో పాలుపంచుకునేవారికే ఇక్కడి సౌకర్యాలను వినియోగించుకునే హక్కుని కలిగి ఉంటారట. ఇది వాళ్లంతా ఏర్పరుచుకున్న నియమం అట. ఇక్కడ పిల్లల కోసం చిన్న లైబ్రరీ కూడా ఉంది. ఈ గ్రంథాలయంలోనే పెద్దలు కూడా సమావేశమై టీవి చూస్తూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునే వెసులుబాటు కూడా ఉండటం విశేషం

మార్పుకు సరైన పాఠం ఇది..
ఇంతింత బడ్జెట్‌ కేటాయింపులతో గొప్ప మార్పు రాదని ఈ గ్రామం ప్రూ చేసిందంటూ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు జల్లు కురిపించారు. సరైన నాయకత్వం, ఐక్యత, క్రమశిక్షణతో అసలైన అభివృద్ధి సాధ్యమని ఈ గ్రామం చెబుతోంది పైగా మోడల్‌ గ్రామీణ అభివృద్ధికి కార్యచరణ ఇలా ఉండాలని తన చేతలతో చెప్పకనే చెప్పింది ఈ గ్రామం. సాముహిక బాధ్యత, క్రమశిక్షణా గొప్ప ఆవిష్కరణలకు మూలస్థంభమవ్వడమే గాక జీవితాలను సైతం మారుస్తుందని ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తుందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా

చదవండి: ‘జయ హో’..! ప్రతికూల పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే..!

Videos

YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది

India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్

ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!

Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ

YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్

కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు

CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు

Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు

ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ

Photos

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?

+5

'అఖండ 2 తాండవం' హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

పిక్నిక్‌ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌! (ఫోటోలు)

+5

ద్వారకాతిరుమల అనివేటి మండపంలో శిల్పకళా వైభవం (ఫొటోలు)

+5

చైతు-శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ప్రత్యేక ఫోటోలు