Breaking News

రాగి జావ, అంబలి ఆహారం...వెయిట్‌ లిఫ్టింగ్‌లో విజయం

Published on Thu, 09/04/2025 - 13:43

ఆమె బరువులు ఎత్తడం మాత్రమే కాదు..మన స్ఫూర్తిని కూడా పైకి ఎత్తుతోంది అంటూ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు గుప్పించారు. సాక్షాత్తూ మహీంద్రా గ్రూప్‌ అధినేతగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆయన లాంటి ప్రముఖుడి నుంచి ప్రశంసలు అందుకున్న ఆమె అత్యంత సాదా సీదా వ్యక్తి. మరీ ముఖ్యంగా 82 ఏళ్ల వయసున్న వృద్ధురాలు. 

ఆ వయసులో ఆమె బరువులు ఎత్తడమే విచిత్రం అనుకుంటే ఆ పని ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఉండడం గొప్ప విశేషం.  తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లా పరిధిలో ఉన్న  పొల్లాచ్చి అనే చిన్న పట్టణానికి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు ఆనంద్‌ మహీంద్రాకు ప్రేరణగా నిలిచింది. 

శారీరక సామర్ధ్యానికి  వయస్సు అడ్డంకి కాదని ప్రపంచానికి నిరూపించడమే ఆ ప్రేరణకు కారణం. ఇటీవల పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియషిప్‌లలో పోటీ పడి అందరినీ ఆశ్చర్యపరిచిన కిట్టమ్మాళ్‌  ధైర్యసాహసాలు  శక్తి సామర్ధ్యాల కథ దానికి ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు ఇవన్నీ వైరల్‌గా మారాయి.

80 వర్సెస్‌ 30...
ఇటీవల కునియాముత్తూరులో జరిగిన ’స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ పోటీలో కిట్టమ్మాళ్‌ పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది, అక్కడ ఆమె పోటీ పడింది తన వయసుకు కాస్త అటూ ఇటూగా ఉన్నవారితో కూడా కాదు ఏకంగా  30 ఏళ్లలోపు ఉన్న మహిళలతో పోటీపడింది. పోటీలో పాల్గొన్న మొత్తం 17 మంది ఇతర  మహిళలతో పోటీ పడి ఆమె ఐదవ స్థానాన్ని దక్కించుకుంది, ఓపెన్‌ ఉమెన్స్‌ విభాగంలో 50 కిలోల బరువును డెడ్‌లిఫ్టింగ్‌ చేయడం ద్వారా  ఈ ఘనత సాధించింది.

ఇంటి పనులే రాటు దేల్చాయి..
తను ఇంటి రోజువారీ అవసరాల్లో భాగంగా చేసిన పనులే తనను వెయిట్‌ లిఫ్టర్‌గా మార్చాయి అంటున్నారు కిట్టమ్మాళ్‌. ప్రతిరోజూ 25 కిలోల బియ్యం సంచులను మోయడం  డజన్ల కొద్దీ కుండల నీరు మోస్తూ తీసుకురావడం అలవాటు అయిందని అదే తనను రాటు దేల్చిందని వివరించారు. తద్వారా బలశిక్షణ తనకు సహజంగానే సాధ్యమైందని చెప్పారు. 

తన శక్తిని గుర్తించిన తన మనవళ్లు రోహిత్, రితిక్‌లచే మార్గదర్శకత్వంతో తాను ఇంటి బరువుల నుంచి జిమ్‌ శిక్షణకు మారానని తెలిపారు.  గత నెల రోజులుగా డెడ్‌లిఫ్టింగ్‌ పద్ధతులను నేర్చుకుంంటూ వచ్చానన్నారు. దీనితో పాటే తన స్టామినాకు తన జీవితకాలపు ఆహారపు అలవాట్లు కూడా కారణమయ్యేయేమో అనిపిస్తుంది. 

ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యార్ధులైన ఆధునికులు అందరూ జపిస్తున్న మిల్లెట్‌ మంత్రాన్ని ఆమె ఎప్పటి నుంచో ఆహారంలో భాగం చేసుకున్నారు.  ఆమె (రాగులతో చేసిన జావ సజ్జలతో గంజి... గుడ్లు, మునక్కాయ సూప్,  వంటివి తీసుకుంటూ అపరిమిత శక్తి సామర్ధ్యాలను స్వంతం చేసుకున్నారు.

ఆమె గురించి ఆనంద్‌ మహీంద్రా ఏమన్నారంటే...
82ఏళ్ల వయసులో ఒక మహిళ బరువులు లిఫ్ట్‌ చేయడం మాత్రమే కాదు మనలోని స్పిరిట్‌ని లిఫ్ట్‌ చేస్తోంది. ఉత్సాహంగా జీవించడానికి, ధైర్యంగా కలలు కనడానికి  మీ లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ ఆలస్యం అనేది లేనే లేదని గుర్తు చేస్తుంది. వయస్సు లేదా సాంప్రదాయ జ్ఞానం పరిమితులను నిర్ణయించదు. మీ సంకల్ప శక్తి మాత్రమే నిర్ణయిస్తుంది.

(చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)