Breaking News

40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్‌గా..!

Published on Sun, 05/24/2026 - 10:35

బయట ఉష్ణోగ్రతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. ఉదయం 10 గంటలకే భానుడు భగభగ మంటున్నాడు. అత్యవసరం ఉంటేనేగానీ బయటకు రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు మాత్రం ఏసీలతో పనిలేకుండా ఇళ్లను కూల్‌గా మార్చే పద్ధతి అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఈ పద్ధతిని దాదాపు నాలుగు వేలకు పైగా కుటుంబాలు అనుసరిస్తూ..విద్యుత్‌ను ఆదా చేస్తూ, పర్యావరణహితంగా జీవనం సాగిస్తుండటం విశేషం. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహింద్రా సైతం ఆ టెక్నిక్‌కు ఫిదా అవ్వతూ ఆ విషయాన్ని సోష్‌ల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు.

జైపూర్‌లో వేసవి ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అక్కడ మాములుగానే వేసవిలో ఉష్ణోగ్రతలు 40°C దాటే ఉంటుంది. ఫలితంగా ఇంటి పైకప్పులు అధిక వేడిని గ్రహించి ఇళ్లు భరించలేనంత వేడిగా ఉంటాయి. ఎయిర్‌ కండిషనర్‌ లేనిదే ఉండలేం అన్నంత దారుణంగా ఉంటుందక్కడ పరిస్థితి. జైపూర్‌కి చెందిన ఒక స్థార్టప్‌ ఆ సమస్యకు రూఫ్‌టాప్ ఫార్మింగ్ సిస్టమ్స్‌తో చక్కటి పరిష్కారం అందించింది. 

ప్రస్తుతం జైపూర్‌లో అంతకంతకు పెరుగుతున్న ఈ రూఫ్‌టాప్ ఫార్మింగ్ ఉద్యమాన్ని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇది తమ ఇళ్లను చల్లగా ఉంచుకుంటూనే సొంత ఆహారాన్ని పండించుకోవాడానికి సహాయపడుతుంది. నివాసితులు సాధారణ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకుంటూనే తమ రూఫ్‌టాఫ్‌లను పచ్చని ప్రదేశాలుగా మార్చడం ద్వారా రోజురోజుకు తీవ్రమవుతున్న వేసవికాలానికి ఎలా అలవాటు పడుతున్నారో మహీంద్రా వివరించారు. 

రాబోయే సంవత్సరాలలో ఎండలు అంతకంతకు అధికమవుతాయన్నది జగమెరిగిన సత్యం. అలాంటి వాతవరణ పరిస్థితులకు ఈ ఆలోచన విధానమే సరైన మార్గదర్శకం అని పోస్టులో పేర్కొన్నారు ఆనంద్‌ మహీంద్రా. అంతేగాదు ఆ స్టార్టప్‌ కంపెనీ ఈ పద్ధతిని సులభంగా ఇన్‌స్టాల్‌ చేసేలా పోర్టబుల్ రూఫ్‌టాప్ గార్డెనింగ్ సెటప్‌లను అందిస్తుంది. అలాగే లీక్-ప్రూఫ్ కంటైనర్లు, డ్రిప్ ఇరిగేషన్ డ్రేనేజీ వంటివి ఉంటాయి. పెద్ద నిర్మాణ మార్పులు అవసరం లేకుండా సులభంగా మొక్కలను పెంచుకునే వీలు కల్పిస్తోంది. 

ఫలితంగా పైకప్పులపై ఉన్న అధికవేడిని తగ్గించడంలో ఈ పచ్చదనం సహాయపడుతుంది. తద్వారా గదులు సులభంగా ఏసీలు అవసరం లేకుండానే చల్లగా ఉంటాయి. ఈ విధానాన్ని అక్కడ చాలా కుటుంబాలు అనుసరించడం విశేషం. పైగా ఈ విధానం వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గడం తోపాటు అధిక ప్రయోజనాలు పొందగలం అని చెబుతున్నారు సదరు స్టార్టప్‌ వ్యవస్థాపకులు. కాగా ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన పోస్టు నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఈ విధానం పర్యావరణ ప్రయోజనాల తోపాటు రోజువారి పొదుపుని కూడా అందిస్తుందని అటున్నారు నెటిజన్లు.

 

(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు)

 

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)

+5

రామ్‌చరణ్‌ 'పెద్ది కీ ఆవాజ్‌' ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)

+5

కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)