Breaking News

ఆసుపత్రిలో బిగ్‌ బీ : ఆంజియోప్లాస్టీ అంటే ఏమిటి?

Published on Fri, 03/15/2024 - 14:58

బాలీవుడ్‌  సూపర్‌  స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను  ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో  చేర్చారు  కుటుంబ సభ్యులు. అక్కడ  బిగ్‌బీకి వైద్యులు యాంజియోప్లాస్టీ  చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ జరిగిందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పలు  నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధి ఒక  కృతజ్ఞతా సందేశాన్ని కూడా  బిగ్‌బీ రోజు సోషల్ మీడియాలో  పోస్ట్‌ చేశారు.  అంతేకాదు   క్రికెటర్‌ గురించి కూడా ఒక ట్వీట్‌ చేయడం విశేషం.   కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్    ప్రభాస్, దిశా పటానీ,  దీపికా పదుకొణె నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ   ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి రానుంది.

ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎపుడు చేస్తారు?
గుండెలోని క్లాట్స్‌ను తొలగించేందుకు  వినియోగించే ఆధునిక టెక్నాలజీ  ఆంజియోప్లాస్టీ.  గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవసరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టెంట్‌ను అమర్చడాన్ని ఆంజియోప్లాస్టీ అంటారు. తద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు.  రక్తనాళాల్లో బ్లాకేజీ 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి ఇది చేస్తారు.

ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం రావడం, అలసిపోయినట్టు అనిపించడం బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం  లాంటి లక్షణాలు కనిపించినపుడు,  హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. తరువాత  హానికరమైన క్లాట్స్‌ను గురించినట్టయితే  ఆంజియో ప్లాస్టీ ద్వారా చికిత్స అందించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారించడంతోపాటు,   ప్రాణాపాయం  నుంచి కాపాడతారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)