Breaking News

పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్‌ సింగర్‌

Published on Tue, 01/28/2025 - 11:04

ఒక మనిషి లావుగా ఉండటానికి, సన్నగా ఉండటానికి వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. జన్యువులు చేసే మ్యాజిక్‌, ఆహారం, జీవనశైలి, ఇతర అలవాట్లు  లాంటివాటి మీద  ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే   కొంతమంది బరువు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటారు. మరికొంతమంది చాలా సులువైన పద్దతుల ద్వారా తమ బరువును నియంత్రణలో ఉంచుకుంటారు.   అది బహుమతిగా కూడా ఉంటుంది.  బరువు తగ్గడం అనేది కొంతమందికి నెలలు  పట్టవచ్చు. మరికొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నపుడు మాత్రం  ఆ ఆనందం  చెప్పనలవికాదు. యూఎస్‌ పాపులర్‌ సింగర్‌ ఈ ఆనందంలో మునిగితేలుతోంది. ఇంతకూ ఈ సింగర్ ఎవరు?  తెలుసుకుందా పదండి!
 

అమెరికన్ గాయని, ర్యాపర్‌  లిజ్జో  ప్రపంచ సంగీత ప్రియులకు సుపరిచితమైన పేరు. చాలా కష్టపడి  ఎట్టకేలకు తన బరువును తగ్గించుకుంది. 2014 నుండి కష్టపడి  ఇప్పటికి తన లక్ష్యాన్ని చేరుకుంది. పదేళ్ల తరువాత తన బరువును చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.  దృఢ సంకల్పం , పట్టుదల, సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు లిజ్జో ఉదాహరణ.

తన సంతోషాన్ని గర్వంగా సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. తన  ఫిగర్‌ ఫోటోను పోస్ట్‌  చేసింది. వెయిట్-ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది.  ‘‘ఈరోజు నేను నా బరువు తగ్గించుకునే లక్ష్యాన్ని చేరుకున్నాను. 2014 నుండి ఈ నెంబర్లు సంఖ్యను చూడలేదు!’’అని తెలిపింది. అలాగే  అనుకున్న లక్ష్యం చేరేందుకు పట్టుదల ముఖ్యఅని గుర్తు పెట్టుకోండి అంటూ అభిమానులను ఉత్సాహపరుస్తూనే  తన  కొత్త లక్ష్యాలకు  టైమ్‌ వచ్చింది అంటూ బరువు తగ్గే విషయంలో కొత్త టార్గెట్‌ పెట్టుకున్నట్టు చెప్పకనే చెప్పింది. ఈమె స్టోరీ ఇపుడు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.  అద్భుతం అభినందనలు అంటూ ఫాలోయర్లు తెగ పొగిడేస్తున్నారు. (రూ. కోటి జాబ్‌ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో)

 

లిజ్జో వివరాలను పోస్ట్ చేసింది. బరువు తగ్గించుకునే ప్రయాణాన్ని ప్రారంభించినప్పటినుంచి  లిజ్జో  బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని 10.5 తగ్గించుకోగలిగింది. బాడీలో ఫ్యాట్‌  16శాతం  తగ్గడం విశేషం.2024,సెప్టెంబరులో ఈ  ప్రయాణం గురించి టిక్ టాక్ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది.   ఎవరెన్ని కమెంట్స్‌  చేసినా తాను మాత్రం లక్ష్యంపై దృష్టి సారించానని ఆమె వెల్లడించింది. అప్పటినుంచి అనేక అప్‌డేట్స్‌  ఇస్తూ  వస్తోంది. అలాగే టైప్‌-2 డయాబెటిస్‌కు   ఓజెంపిక్ వాడుతోందన్న  ఆరోపణలను కూడా తోసిపుచ్చింది. కాగా యుఎస్ పాప్ స్టార్ లిజ్జోపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. తమను వేధిస్తోందని,  ముగ్గురు మాజీ డ్యాన్సర్ల ఆరోపించారు. అయితే వీటిని తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేసింది కూడా.

 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)