వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
తిమింగలాల వమనంతో పరిమళద్రవ్యం..!
Published on Sun, 08/02/2026 - 13:18
సాధారణంగా పర్‌ఫ్యూమ్‌ల తయారీలో పువ్వులు, వేర్లు; కొన్నిరకాల జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను ఉపయోగిస్తారు. తిమింగలాల వమనం(వాంతి)తో కూడా పర్‌ఫ్యూమ్‌ను తయారు చేస్తారంటే నమ్మశక్యంగా ఉండదు గాని, ఇది నిజం.
ఈజిప్టు నాగరికత కాలం నుంచి వాడుకలో ఉన్న అత్యంత పురాతన పరిమళద్రవ్యం ఇది. తిమింగలాలు తినే కదంబ చేపలు, కనవ చేపలలోని అరగని భాగం గట్టి వ్యర్థపదార్థంగా మారి, తిమింగలాల వమనంలో బయటకు వస్తుంది. దీనిని ‘అంబర్‌గ్రిస్’ అంటారు. దీనిని ఇప్పటికీ పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వినియోగిస్తున్నారు.
#
Tags : 1