Breaking News

హీరో అజిత్‌ కుమార్‌ బాధపడుతోంది ఈ వ్యాధితోనే..!

Published on Sun, 03/10/2024 - 18:24

ఇటీవల తమిళ హీరో అజిత్‌ కుమార్‌ చెకప్‌ కోసం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏమైందంటూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ  నెలకొంది. దీనిపై అజిత్‌ పీఏ సురేశ్‌చంద్ర స్పందించి వివరణ ఇచ్చారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్‌ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు చెవి వెనుక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చా‍ర్జ్‌ అయ్యారని చెప్పుకొచ్చారు.  అయితే వైద్య నటుడు అజిత్ కుమార్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది.  అసలేంటీ ఈ వ్యాధి? ఎందువల్ల వస్తుందంటే..

ఈ సెరిబ్రల్‌ ఇన్ఫార‍్క్షన్‌ని వైద్యపరంగా ఇస్కీమిక్‌గా స్ట్రోక్‌ అని పిలుస్తారు. తగినంత ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినండంతో ఈ  స్ట్రోక్‌ సంభవిస్తుంది. మెదడులోని ధమని బ్లాక్ అయినప్పుడు లేదా చిట్లినప్పుడూ ఈ సమస్య తలెత్తుంది. ఇది మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో  మెదడులోని నరాలు వాపుకి దారితీయడంతో ఇదంతా జరుగుతుంది. దీంతో రోగికి పక్షవాతం రావడం లేదా కొన్ని సమయాల్లో సీరియస్‌ అయ్యి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రోగికి తక్షణమే చికిత్స అందడం అనేది అత్యంత ముఖ్యం. 

 ఈ వ్యాధి లక్షణాలు..

  • వికారం లేదా వాంతులు
  • కంటి కదలికలో సమస్యలు, సరిగా కనిపించకపోవడం
  • తలనొప్పి
  • మాట్లాడడంలో ఇబ్బంది
  • చేతులు, పాదాలు లేదా ముఖంలో తిమ్మిరి అనుభూతి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • మూర్ఛ  లేదా కోమాలోకి వెళ్లిపోవడం

కారణాలు

అధిక రక్తపోటు మధుమేహం, ధూమపానం, ఊబకాయం, కొలస్ట్రాల్‌, డయాబెటిస్‌, లేదా సడెన్‌గా చక్కెర స్థాయలు పెరగడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. 

నివారణ
ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అలాగే  వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ఆదిలోనే గుర్తించగలుగుతాం. అలాగే స్ట్రోక్‌ వచ్చిన రోగులకు థ్రోంబోలిటిక్ మందులతో నయం చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రావీనస్‌ ఆర్‌టీపీఏ థెరపీని అందిస్తే రోగిని సుమారు 3 గంటల్లో మాములు మనిషిగా చెయ్యొచ్చు. 

(చదవండి: కేన్సర్‌పై యువతి పోరు..ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)