Breaking News

మల్టీపర్పస్‌ రోబో : పనులన్నీ చక చకా

Published on Wed, 03/05/2025 - 12:49

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రిహబ్, ఇక్రిశాట్, టిహబ్, ఐఎస్‌బి, ట్రిపుల్‌ ఐటి, ఐఐటి హైదరాబాద్, బిరాక్‌లలో 2017లో ఇంక్యుబేట్‌ అయిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ ‘ఎక్స్‌ మెషిన్స్‌’. ఈ ఇండియన్‌ రోబోటిక్స్, ఎఐ కంపెనీ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్‌ కుమార్‌ డోగ్గా. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ఎఐపి బిల్డింగ్‌ కేంద్రంగా ఎక్స్‌ మెషిన్స్‌ రీసెర్చ్‌ లాబ్‌ పనిచేస్తోంది. ఎక్స్‌ మెషిన్స్‌ రూ పొందించిన కృత్రిమ మేధ ఆధారిత మల్టీపర్పస్‌ రోబో వ్యవసాయంలో కూలీలు చేసే కలుపుతీత వంటి అనేక పనులను చక్కబెడుతుంది. 

పంటల సాగులో రసాయనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం, శాస్త్రీయ, సుస్థిర వ్యవసాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తేవటం ఎక్స్‌ మెషిన్స్‌ లక్ష్యాలు.  ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌ కోసం మల్టీపర్పస్‌ ఎఐ బేస్‌డ్‌ రోబోలను తయారు చేస్తోంది. వ్యవసాయంతో  ప్రారంభించి ఇతర పరిశ్రమలకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ రోబోలను ఎవరూ నడపాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ ప్రయాణాన్ని నిర్దేశించుకొని పనిచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.  మిరప, పత్తి, పొగాకు తదితర సాళ్లుగా విత్తే పంట  పొలాల్లో అన్ని మొక్కలకూ పురుగుమందుల పిచికారీలు అవసరం ఉండదు. కనీసం 30% మొక్కలకు అవసరం ఉండదని ఎక్స్‌ మెషిన్స్‌ సంస్థ అంచనా. చీడపీడల బారిన పడిన మొక్కల్ని ఎఐ టెక్నాలజీతో గుర్తించి వాటిపై మాత్రమే పిచికారీ చేయటం ఈ రోబో ప్రత్యేకత అని చెబుతున్నారు.  వ్యవసాయంతో పాటు గోదాములు, లాజిస్టిక్స్, రక్షణ శాఖ అవసరాలు, ఉత్పత్తి యూనిట్లకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.

చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు 

సాంకేతికత: ఎక్స్‌ 111– మల్టీపర్పస్‌ రోబో
సమస్య: కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లలో ఒకటి. దాని అనుబంధ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి.  

పరిష్కారం:  

  • ఈ సవాల్‌ను అధిగమించడానికి ఎక్స్‌ మెషిన్స్‌ రోబోని రూపొందించింది.

  • వ్యవసాయ పంటల్లో కలుపు సమస్య, కూలీల కొరత లేకుండా చేస్తుంది. 

  • ఇది విత్తనం వేయటం, నారు పెంపకం, మైక్రో స్ప్రేలు, ఎరువుల పిచికారీ, ఇతర పనులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. 

  • ఇది 8 గంటల సమయంలో 2.5 ఎకరాల్లోని కలుపు మొక్కల్ని తొలగిస్తుంది. 

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)