Breaking News

మిడిసిపాటు అంటే ఇదే!

Published on Mon, 08/25/2025 - 10:22

ఒక ఊర్లో ఓ బలవంతుడైన  యువకుడు ఉండేవాడు. తన శరీరాన్ని చూసి జనం భయపడుతుండటంతో అతడిలో గర్వం మొదలయ్యింది. దాంతో చిన్నాపెద్దా, ఆడామగా తేడా చూడకుండా ఊర్లోవాళ్ళని ఏడిపించడం  ప్రాంరంభించాడు. తనకు అందరూ భయపడాల్సిందేనని, తను చేయలేని పని ఏదీ లేదని ఇష్టానుసారం వ్యవహరించేవాడు. ఒకరోజు వ్యవసాయం పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. అతడు వస్తున్నది చూసి అందరూ వెళ్ళి ఇండ్లల్లో దాక్కొన్నారు.

అదే ఊరి దగ్గర బిడ్డను గట్టుపైన పడుకోబెట్టి వర ఇపొలంలోని కలుపు మొక్కలను ఏరి పారేస్తోంది ఓ మహిళ. ఆ బలవంతుడి రాకను ఆమె గమనించలేదు. తన పనిలో తాను లీనమై ఉంది. లేత ఎండ గట్టు మీద ఉన్న బిడ్డపై పడటంతో ఆ బిడ్డ ఏడుపు లంకించుకున్నాడు. బిడ్డ ఏడుపు పట్టించుకోకుండా ఆ బలవంతుడు ‘‘నేనంటే నీకు భయం లేదా?’’ అని అడిగాడు ఆమెను. ఆ అహంభావి గురించి విని ఉన్న ఆమె అతడి పొగరు తగ్గించడానికి అదే అదనుగా భావించింది.‘‘నేను భయపడటం పక్కన పెట్టు. మొదట నా బిడ్డ ఏడుపు ఆపించు చాలు’’ అంది. ‘అదెంత పని’ అని అతడు ఆ బిడ్డ ముందర కెళ్ళి నిలబడ్డాడు. బిడ్డను భయపెడుతూ రకరకాల విన్యాసాలు చేశాడు. అయితే ఆ బిడ్డ ఏమాత్రం ఏడుపు ఆపలేదు.

ఆశ్చర్యపోతూ అతడు ‘‘ఈ బిడ్డ నన్ను చూసి ఎందుకు భయపడటం లేదు? ఏడుపు ఎందుకు ఆపడం లేదు’’ అని అడిగాడు.ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని ‘‘నువ్వు ఎవరో, నీ ప్రతాపం ఏమిటో ఈ బిడ్డకు తెలియదు. అందుకే ఈ బిడ్డ నీ బెదిరింపులను పట్టించుకోలేదు. మన గురించి ప్రపంచానికంతా తెలుసనుకుంటే ఎలా? నాలుగు ఊర్లు దాటి పెద్ద నగరాలకు వెళ్తే నువ్వెవరో జనానికి తెలియదు. కొందరు గుర్తించినా, అక్కడ నిన్ను ఢీ కొట్టేవాళ్ళు చాలామంది ఎదురవుతారు. మనం మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకుంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా చెల్లుబాటవుతాము. 

చదవండి: Nhatyela Sreedharan బీడీ కార్మికుడిగా పుట్టి.. ద్రావిడ భాషల వారధిగా!

ఇప్పటికైనా నీ కండలు చూసుకుని  మురిసిపోవద్దు. వయసు ఎల్లకాలం ఉండదని గుర్తుపెట్టుకో.’’ అని హితవు పలికింది. ‘ఈ విశాల విశ్వంలో మనం సముద్రంలోని ఇసుక రేణువంత. మనకు ఎన్ని ఉన్నా... మిడిసిపాటు వద్దు, మంచితనం ముద్దు’ అని గుర్తించి ముందుకు నడిచాడు ఆ బలవంతుడు.  ఆమె తన బిడ్డను ఎత్తుకుని ముద్దులాడటంతో ఆ బిడ్డ ఏడుపు ఆపింది.

ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్‌ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)