Breaking News

భారత్‌లోనే బాగుంది.. అందుకే ఇక్కడ ఉండిపోయా..!

Published on Fri, 09/05/2025 - 16:14

ఒక నైజీరియన్‌ వ్యక్తి భారతదేశంలోనే ఎందుకు ఉన్నాడో సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో దేశానికి ఎందుకు వెళ్లాలనపించలేదో కూడా వివరించాడు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయ్యిన వెంటనే భారత్‌లో అడగుపెట్టి ఇక్కడే ఉండిపోయానని..అంతగా ఈ దేశం తనలోకి కలుపుకుందంటూ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అంతేగాదు ఇక్కడే ఉండిపోవాలనిపించేంతగా ఇష్టం పెరగడానికి గల కారణాలేంటో కూడా షేర్‌ చేసుకున్నాడు. మరి అవేంటో చూద్దామా..!

పాస్కల్ ఒలాలే అనే నైజీరియన్‌ వ్యక్తి భారతదేశం తనకెంత సౌకర్యవంతంగా అనిపించిందో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. తాను 2021 లాగోస్‌ విశ్వవిద్యాలయం నుంచి బయటకు రాగానే నేరుగా భారతదేశంలో అడుగుపెట్టానని, ఆ క్షణం నుంచే ఈ దేశం నుంచి కాలు బయట పెట్టలేదని, తిరిగి ఏ విదేశాలకు వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. 

ఇక్కడ ఆహారం, భద్రత, బస, వివక్ష వరకు అన్నింటిల్లోనూ స్వచ్ఛమైన స్వేచ్ఛను పొందానని ఆనందంగా చెబుతున్నాడు ఒలాలే. అంతేగాక తాను ఇక్కడే ఉండిపోవడానికి గల ప్రధాన కారణాలను కూడా వివరించాడు.

ఇక్కడ ప్రతి ఉదయం ఆందోళనతో మేల్కొను, ఎలాంటి టెన్షన్‌లేని ప్రశాంత జీవనం గడుపుతాను

అలాగే నా చర్మం రంగు కారణంగా బెదరింపులు ఎదుర్కొనడం అనేవి ఇక్కడ ఉండవు.

ఇక్కడ హాయిగా జీవించొచ్చు, ఎలాంటి హడావిడి కల్చర్‌ ఉండదు

ప్రజలు ముక్కుసూటిగా ఉంటారు, మంచి నిజాయితీ ఉంటుంది

తనది నల్లజాతి అని తన జాతిని నిరంతరం గుర్తు చేసేలా వివక్షకు తావుండదు.

అలాగే యూఎస్‌లో కంటే ఇక్కడ రాత్రిపూట వీధుల్లో సురక్షితంగా వెళ్లగలను

ఇంటి అద్దె చౌక, ఆహారం సహజమైనది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. 

స్వేచ్ఛ అనేది చాలా దేశాల్లో అది కాగితాలకే పరిమితమై ఉంది, కాని ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. 

నా ఆహార్యాన్ని బట్టి కాకుండా కేవలం ఒక వ్యక్తిగా గౌరవం లభిస్తుంది. 

అందువల్లే ఏ విదేశాలకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయానని, ఇదొక స్వర్గసీమ అంటూ కితాబులిచ్చేశాడు. అందుకు సంబంధిచిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మిస్టర్‌ ఓలాలే మా దేశానికి స్వాగతం, మీ మాటలు వింటుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వపడుతున్నా..అంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: జస్ట్‌ 32 ఏళ్లకే కోటీశ్వరురాలిగా యూట్యూబర్‌.! ఆ సీక్రెట్‌ ఇదే..)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)