Breaking News

ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..

Published on Sat, 08/23/2025 - 14:34

ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. 

ఎలిటా ఆండ్రీ  2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌.  రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి.

 

ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్‌ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ మ్యూజియం, మయామిలోని ఆర్ట్‌ బాసెల్‌తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది.  ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్‌సైట్‌ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)