Breaking News

మీ పాప టీనేజ్‌లోకి అడుగు పెట్టిందా? ఈ సూచనలు మీకోసమే!

Published on Sat, 06/27/2026 - 08:14

చిన్నారులు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కౌమార దశ లేదా టీనేజ్‌ ఎంతో కీలకం. ఆ సమయంలో వారు చేసుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. అందువల్ల తల్లిదండ్రులు కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!

సరిగ్గా చెప్పాలంటే, టీనేజ్‌లోనే భావోద్వేగాల పరిణతి వస్తుందట. ప్రతిదీ ఈ దశలోనే నేర్చుకుంటారట. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు అయినదానికీ కానిదానికీ పిల్లలను విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనూ, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్‌గా దూరమవుతారని, తమ సమస్యలను చెప్పడానికి భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వారి తప్పు సరిచేసే ముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్‌దేనని చెబుతున్నారు. టీనేజీ పిల్లలను కుటుంబ సభ్యులను, టీచర్లు మరింతగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

శుభ్రతా ముఖ్యమే... 
ఇక పీరియడ్స్‌ మొదలయ్యాక మరో కొత్త సవాలు ఎదురైవుతాయి. ముఖ్యంగా, పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.

తగ్గ ఆహారం... 
ఎదిగే వయసులో అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఎంత బిజీగా ఉన్నా సరే, మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. అధి కప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో–ఫ్యాట్, లో–కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలి.

క్లాస్, చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతారు కాబట్టి, మీ పాప రోజుకి కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, చక్కెర లేని పండ్ల రసాలూ మంచివేని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాఫీ, టీ, కార్బొనేటెడ్‌ డ్రింక్‌లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలకూ దూరంగా ఉంచాలని తెలియజేస్తున్నారు.

ప్రశాంతంగా: ఓ వైపు శరీరంలో మార్పులు, మరోవైపు చదువు ఇవన్నీ పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వడం వల్ల తమ గురించి తాము ఆలోచించుకునేందుకు సాయపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్‌ క్రాఫ్ట్‌వర్క్‌ వంటివి చేసేలాగాప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతారు.

అంతేకాకుండా, టీనేజ్‌ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌ లాంటి వాటి గురించి తెలియజేయాలని చెబుతున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్‌ అబ్యూజింగ్‌ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని సూచిస్తున్నారు.

హార్మోన్లలో మార్పులు...
టీనేజ్‌లో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య మొటిమలు ఒకటి. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ చెప్పాలంటున్నారు. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకూడదు.

అర్థం అయేలా చెప్పాలి...
రుతుక్రమం... శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే వస్తాయి. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్‌ మొదలవక ముందే పిల్లలకు అర్థమయ్యేలా వారి మనసు నొప్పించకుండా సున్నితంగా చెప్పాలనీ, అప్పుడే, మనసులో ఉన్న భయాలూ, అపోహలూ తొలగిపోయి, తమలో వస్తోన్న మార్పులను అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.

వ్యాయామంతో...
సిగ్గు, బిడియం లాంటి వాటి వల్ల టీనేజ్‌ అమ్మాయిలు ఆటలకు దూరం అవుతున్నారనీ, కాబట్టి, ఆ ఫీలింగ్స్‌ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, వాకింగ్, రన్నింగ్‌ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలి. వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయి.

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)