Breaking News

97 ఏళ్ల వయసులో ఆకాశంలోకి దూసుకెళ్లి..గిన్నిస్‌ రికార్డు!

Published on Fri, 08/07/2026 - 13:22

తొమ్మిది పదుల వయసు అంటే.. హాయిగా విశ్రాంతి తీసుకునే వయసు. పెద్దగా ఆ ఏజ్‌లో ఎవ్వరినీ గుర్తుపట్టలేరు, ఏ విషయాలను గుర్తించుకోలేరు. అలాంటి వయసులో అసామాన్యమైన సాహస కృత్యాలు అంటే..వామ్మో అనిపిస్తుంది. యువత సైతం హడలిపోయే గగ్గరుపాటు విన్యాసాలతో ఔరా అనిపించుకుంటూ..భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఈ వండర్‌ బామ్మ. అనారోగ్యం మనల్ని మన శక్తిని ఆపలేదని చాటి చెబుతూ..జీవించే లోపు అన్ని చేసేయంటూ గొప్ప సందేశాన్ని ఇస్తూ యువతను మేల్కొలుపుతోందామె.

ఆ బామ్మే ఇంగ్లాండ్‌లోని చెల్టెన్‌హామ్‌కు చెందిన బెట్టీ బ్రోమేజ్. ఆమె 2025లో పక్షవాతానికి గురైంది. ఆ తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్నాక..తాను ట్రీట్‌మెంట్‌ పొందిన చెల్టెన్‌హామ్ జనరల్ హాస్పిటల్‌లోని స్ట్రోక్ యూనిట్ కోసం నిధులు సేకరించడం కోసం సాహస కృత్యాలు చేసేందుకు రెడీ అయ్యింది. 

అది కూడా ఆకాశంలో ఎగురుతున్న విమానం పైభాగంలో తనను తాను కట్టుకుని ఈ సాహసోపేతమైన సవాలుని పూర్తి చేస్తోంది. ఇలా ఎగిరే విమానంపై నిలబడి చేసే సాహాసాన్ని వింగ్‌ వాక్‌ అంటారు. ఆమె తన తొలి వింగ్‌ వాక్‌ను 87 ఏళ్ల వయసులో పూర్తి చేసింది. ఆమె గతంలో నాలుగేళ్ల క్రితం గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసి టైటిల్‌ని సొంతం చేసుకుంది.

ఇలాంటి సాహసాలు అప్పటి నుంచి..
బ్రోమేజ్ 2025లో పక్షవాతానికి గురయ్యారు, అది ఇప్పటికీ ఆమె మాటతీరును ప్రభావితం చేస్తోంది. అయినప్పటికీ, తాను ఇష్టపడే పనిని చేయకుండా ఆ వ్యాధి తనను ఆపకూడదని స్ట్రాంగ్‌గా నిశ్చయించుకున్నానని చెబుతోంది ఈ బామ్మ. ఇది జస్ట్‌ తన మాటలనే ప్రభావితంచేసింది మొత్తం తన శరీరాన్ని కాదని ధీమాగా చెబుతోందామె. 

ఆమె కోలుకుంటున్న సమయంలో సహాయం చేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపే మార్గంగా, అలాగే ఆసుపత్రిలోని స్ట్రోక్ యూనిట్ కోసం నిధులు సేకరించేందుకు ఈ వింగ్‌వాక్‌ సాహసాలను ఎంచుకుంది. ఇక ఆస్పత్రి ఛారిటీ ప్రకారం..ఈ నిధుల సేకరణ నుంచి వచ్చే విరాళాలు రోగులకు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ప్రయోజనం చేకూర్చడమే గాక, పరికరాలను కొనుగోలు చేయడానికి సహాయపడుతుంది. 

వందో పుట్టినరోజు కల్లా..
తన వందో పుట్టినరోజు సమీపిస్తున్న కూడా సాహసోపేతమైన సవాళ్లకు స్వస్తి పలకనని అంటోంది. ఎందుకంటే ఈ డేరింగ్‌ ఫీట్‌లు లేకపోతే..జీవితంపై విసుగు వచ్చేస్తుందట. తనకు సరిగా కనిపించదు కాబట్టి డ్రైవ్‌ చేయలేనని, అందువల్ల చాలా బాధగా, నిరాశగా అనిపిస్తుంది. ఆ కారణంగానే తన వల్ల అయ్యే పనులను మాత్రం ఆపకుండా చేస్తూనే ఉంటానంటోంది. 

తనకు వింగ్‌ వాకింగ్‌లో అత్యంత కష్టమైన భాగం గాలిలో ఎగరడం కాదని, విమానం పైకి ఎక్కడమేనని నవ్వుతూ చోబుతోంది. ఎందుకంటే తను చాలా పొట్టిగా ఉండటం వల్ల రెక్కపైకి ఎక్కడమే ఏకైక సమస్య అని అంటోంది. కానీ ఒక్కసారి పైకి ఎక్కితే ఏ సమస్య ఉండదని అంటోంది. 

ఆ దాతృత్వ కార్యక్రమాలకు ప్రేరణ..
ఒకప్పుడు నర్సుగా పనిచేసిన బ్రోమేజ్, నిధుల సేకరణ పట్ల తనకున్న అభిరుచికి, ఒకప్పుడు ఆస్పత్రి గోడపై ప్రదర్శించిన ఒక కొటేషన్ స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. "మనం ఈ ప్రపంచంలో ఒక్కసారే జీవిస్తాము. మనం చేయగలిగిన ఏ మంచి అయినా, మనం చూపగలిగే ఏ దయ అయినా, ఇప్పుడే చేసేయండి. దానిని వాయిదా వేయొద్దు లేదా నిర్లక్ష్యం చేయొద్దు." "మీరు మళ్ళీ ఈ మార్గంలో ప్రయాణించరు," అని రాసిన మాటలు తన జీవితాంతం తనతోనే ఉన్నాయంటోంది ఈ బామ్మ. 

అవే తన సేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తూనే ఉన్నాయని చెప్పారు. పైగా తన 100వ పుట్టినరోజు కోసం ఇప్పటికే ఇక సవాలుని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపింది ఈ బామ్మ. ఆమె అసాధారణమైన పట్టుదలకు సదరు ఆస్పత్రి ఛారిటీ అధికారులు మంత్రముగ్ధులవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఈ బామ్మ సాహసానికి లేదా సమాజానికి తిరిగి సేవ చేయడానికి వయసు ఎన్నటికీ అడ్డంకి కాదని గిన్నిస్‌ రికార్డు గెలుపొంది మరి నిరూపించింది కదూ..!.

 

(చదవండి: 92 కేజీల నుంచి 60 కేజీలకు..! ఆ ఆహారాలకు 'నో' చెప్పాల్సిందే..)

 

 

 

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)