Breaking News

92 ఏళ్ల టీచరమ్మ ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..

Published on Sun, 06/14/2026 - 13:43

తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్‌గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్‌ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్‌లుక్‌లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్‌ సైన్స్‌ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్‌. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. 

వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్‌ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్‌నెస్‌ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే  మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. 

ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్‌ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్‌నెస్‌ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్‌, తేలికపాటి జాగింగ్‌, లక్షిత స్ప్రింట్‌ల శ్రేణి, వాకింగ్‌, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్‌ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.

ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలు
ఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్‌ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. 

అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్‌నెస్‌కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. 

 

(చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్‌! భావోద్వేగంలో ఓ నాన్న..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)