Breaking News

ఇప్పటికీ డ్రైవింగ్‌ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్‌ రోగులకు..

Published on Tue, 03/10/2026 - 12:15

ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్‌ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్‌లను సర్క్యూట్‌ రేసింగ్‌లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్‌ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్‌ బామ్మ..!.

ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్‌. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్‌ వయసులోనే అధిగమించి శెభాష్‌ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్‌ పట్ల మక్కువ ఉండేది. 

అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్‌ సవాలు వరకు అన్ని డ్రైవ్‌లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్‌ రైసింగ్‌ ప్రయత్నించి..థ్రిల్‌ ఫీల్‌ని ఎంజాయ్‌ చేసింది. 

ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్‌లో మరింత స్కిల్‌ని పుణికిపుచ్చుకుంది జరీన్‌. దాంతో ఆమెకు డ్రైవింగ్‌ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్‌మెంట్ స్టోర్‌ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్‌మెంట్‌లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్‌ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. 

అంతేగాదు జరీన్ డ్రైవింగ్‌ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని,  పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్‌. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్‌. ఎనభైలలో కూడా డ్రైవింగ్‌ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)