Breaking News

కిటికీ ఇనుప క‌డ్డీల్లో ఇరుక్కున్న బాలిక...స్కూల్లో రాత్రంతా నరకం!

Published on Sat, 08/23/2025 - 15:13

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలోని  కియోంజార్ జిల్లాలో జరిగిన ఘటన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. రెండో తరగతి  రాత్రంతా   స్కూల్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన వైనం కలకలం రేపింది. బన్స్‌పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఈ సంఘటన జరిగింది.

8 ఏళ్ల జ్యోత్స్న దేహూరి రెండో తరగతి చదువుతోంది.  స్కూలు ముగిసిన తరువాత జ్యోత్న కనిపించకుండా పోయింది.  దీంతో  ఆమె తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికినా ఫలితం కనపించలేదు. అసలేం జరిగిందంటే..

సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమయం ముగియడంతో, 8 ఏళ్ల జ్యోత్స్న లోపల ఉందో లేదోచెక్‌ చేయకుండానేఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు తాళం  వేసి వెళ్లిపోయారు.  అయితే తాళం వేసిఉన్నట్టు గుర్తించిన జ్యోత్న కిటికీ గుండా పాఠశాల నుండి బయటకు రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె  కిటికీ ఊచల మధ్య ఇరుక్కు పోయింది. రాత్రంతా అలానే నరక యాతన అనుభవించింది.

ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్‌ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!

శుక్రవారం ఉదయం 9 గంటలకు గేటు తెరిచిన తర్వాత ఆమె ఇరుక్కుపోయి ఉండటం చూసి పాఠశాల వంటమనిషి షాక్ అయ్యాడు. వెంటనే  గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఇనుప రాడ్లను  వంచి జ్యోత్స్నరక్షించారు. అనంత‌రం  ముందు జాగ్రత్త చర్యగా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అదృష్టవశాత్తూ చిన్నారికి ఎలాంటి ప్రాణ‌పాయం లేద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. దీంతో జ్యోత్న్స తల్లిదండ్రులు, స్థానికులు, టీచ‌ర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు గౌరహరి మహంతను సస్పెండ్ చేశారు.

చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)