Breaking News

అలాంటి ఇలాంటి ప్రేమకథ కాదు..!

Published on Fri, 07/11/2025 - 11:37

ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం అత్యంత సర్వసాధారణం. 70 ఏళ్లు పైబడ్డాక ప్రేమ అంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ వృద్ధ జట ఆ వయసులో ప్రేమలో పడి, పెళ్లిచేసుకుని అందరికీ షాక్‌ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ప్రేమకు వయసు అడ్డంకికాదు అంటే ఇదే అంటూ ఆ వృద్ధ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

ఈ ఆశ్చర్యకరమైన ఘటన కేరళలోని త్రిశూర్‌లో చోటుచేసుకుంది. వారే విజయరాఘవన్‌(79), సులోచన(75). ఈ ఇద్దరి నడుమ ప్రేమ ప్రభుత్వం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చిగురించింది. విజయ రాఘవన్‌ ఈ ఆశ్రమంలోకి 2019లో రాగా, సులోచన 2024లో వచ్చారు. ఇరువు వృద్ధాశ్రమ కారిడార్లో కలుసుకుని మాట్లాడుకునే వారు. 

అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి పెళ్లిపీటలు ఎక్కేంత వకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆనందకర వేడుక కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్. బిందు, నగర మేయర్ ఎం.కె. వర్గీస్ సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. 

ఆ దంపతులు స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ కింద వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ఫిదా అవుతూ..నిజమైన ప్రేమకు వయోభేదం ఉండదు..అది అవుధులు లేనిది అంటూ ఆ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. 

 

(చదవండి: ‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..! ఏకంగా ప్రధాని మోదీ..)
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)