గుజరాత్‌ నుంచి 40 రోజులు : అయోధ్యకు నడిచొచ్చిన వృద్ధుడు

Published on Fri, 10/10/2025 - 16:26

అయోధ్య: శ్రీరాముడిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు గుజరాత్‌లోని మెహసనా నుంచి కాలినడకన బయలుదేరి 1,338 కిలోమీటర్ల దూరంలోని యూపీలోని అయోధ్య క్షేత్రానికి 40 రోజుల్లో గురువారం చేరుకున్నారు. అయోధ్యకు (Ayodhya) నడిచి వెళ్లాలనే మూడు దశాబ్దాలనాటి సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. 

మెహసనా జిల్లా మోదీపూర్‌ గ్రామానికి చెందిన జయంతీలాల్‌ హర్‌జీవన్‌దాస్‌ పటేల్‌ (Jayantilal Harjivandas Patel) 1990లో బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన సోమ్‌నాథ్‌–అయోధ్య రథయాత్రను స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పట్లో గుజరాత్‌లోని జరిగిన ఆ యాత్రలో జయంతీలాల్‌ పటేల్‌ పాల్గొన్నారు కూడా. అయోధ్యలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరగడంతో తన కల నెరవేర్చుకునే సమయం వచ్చిందని భావించారాయన. ఆ మేరకు తన యాత్రను ఆగస్ట్‌ 30వ తేదీన స్వగ్రామం నుంచి ప్రారంభించారు. 

రోజుకు 33–35 మేర నడుస్తూ, రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకున్నారు. మార్గమధ్యంలోని ఆలయాలు, పబ్లిక్‌ పార్కులు, అతిథి గృహాల్లో విరామమిచ్చేవారు. కుటుంబసభ్యులు ఫోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడంతోపాటు, ఆ మార్గంలో తర్వాతి స్టాప్‌ ఏమిటో తెలియజేస్తుండే వారు. అయోధ్యకు చేరుకున్న జయంతీలాల్‌ కరసేవక్‌పురంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్‌ సెక్రటరీ చంపత్‌ రాయ్‌ను కలుసుకున్నారని ట్రస్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: 5 నిమిషాల్లో జాబ్‌ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)